Veera Dheera Sooran: ఒక సినిమా షూటింగ్ పూర్తయిన దగ్గర నుండి విడుదల అయ్యేవరకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అన్నీ ఇబ్బందులను దాటుకుంటూ విడుదల తేదీ ఖరారు చేసుకున్న సమయంలో కూడా అనుకోకుండా ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అయిన విక్రమ్ నటించిన మూవీకి కూడా ఇలాంటి కష్టాలే ఎదురవుతున్నాయి. విక్రమ్ అన్నా, తన సినిమాలు అన్నా చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ప్రతీ సినిమా కోసం తను చాలా కష్టపడతాడంటూ ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అలా విక్రమ్ తాజాగా నటించిన ‘వీర ధీర శూరన్’ సినిమా విడుదలకు ఇంకా కొన్నిరోజులే ఉండగా ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
మేకర్స్‌ది తప్పు
విక్రమ్ హీరోగా నటించిన ‘వీర ధీర శూరన్’ షూటింగ్ ప్రారంభించుకున్నప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. తాజాగా అన్ని ఇబ్బందులు దాటుకొని విడుదల చేసేద్దాం అనుకునే సమయానికి మూవీ టీమ్‌కు మరొక ఛాలెంజ్ ఎదురయ్యింది. తాజాగా ఈ సినిమాను నాలుగు వారాల పాటు బ్యాన్ చేస్తున్నట్టుగా ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా షాక్‌లో ఉన్నారు. ఇలా జరగడం వెనుక పెద్ద కథే ఉంది. ముంబాయ్‌కు చెందిన బీ4యూ అనే కంపెనీ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కుల విషయంలో మేకర్స్‌పై కేసు ఫైల్ చేసింది. ఈ కేసులో విచారణ జరిపిన తర్వాత ‘వీర ధీర శూరన్’ మేకర్స్ చేసిందే తప్పు అని ఢిల్లీ హైకోర్టు తేల్చింది.
షోలు క్యాన్సిల్
బీ4యూ కంపెనీ ఈ కేసు గెలవడంతో ‘వీర ధీర శూరన్’ మేకర్స్ వెంటనే వారికి రూ.7 కోట్లు కట్టాలని, అంతే కాకుండా దానికి తగిన డాక్యుమెంట్స్ కూడా 48 గంటల్లోపు కోర్టుకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. మూవీ మేకర్స్ కేసు ఓడిపోవడం వల్ల దేశవ్యాప్తంగా ‘వీర ధీర శూరన్’ మార్నింగ్, మ్యాట్నీ షోలు ఆగిపోయాయి. యూఎస్‌లో ఏర్పాటు చేసిన ప్రీమియర్స్‌కు కూడా బ్రేకులు పడ్డాయి. ‘సికందర్’, ‘ఎల్2 ఎంపురాన్’, ‘రాబిన్‌హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి సినిమాలతో పోటీపడుతూ బాక్సాఫీస్ బరిలో దిగాలని నిర్ణయించుకుంది ‘వీర ధీర శూరన్’. కానీ ఫైనల్‌గా వారి ప్లాన్స్ ఏవీ వర్కవుట్ అవ్వలేదని తెలుస్తోంది. దీంతో మూవీ టీమ్ అయోమయంలో పడింది.
Also Read: రిలీజ్ కోసం రెమ్యునరేషన్ వదులుకున్న విక్రమ్..
ప్రమోషన్స్ చేయండి
‘వీర ధీర శూరన్’ (Veera Dheera Sooran) ప్రమోషన్స్ కోసం మూవీ టీమ్ అంతా ఎంత కష్టపడినా దీనిపై ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. ఈ కాంట్రవర్సీ వల్ల అయినా దీని గురించి ప్రేక్షకులు మాట్లాడుకునే అవకాశం ఉంది. సినిమా బ్యాన్ అవ్వడం వల్ల, రిలీజ్ లేట్ అవ్వడం వల్ల ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకునే టైమ్ దొరుకుతుంది. విక్రమ్ (Vikram) సినిమాలకు చివరి నిమిషంలో కష్టాలు ఎదురవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీర ధీర శూరన్’కు కూడా అదే పరిస్థితి వస్తుందా అని ఫ్యాన్స్ ఆందోళనపడుతున్నారు.