RGV : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి పేరు చెప్తే వివాదాలు పులకరిస్తాయో.. ఎవరి పేరు వినగానే రాజకీయాల్లో రచ్చ మొదలవుతుందో.. ఎవరి పేరు వినగానే కుర్రాళ్ళ గుండెల్లో మూత మోగుతుందో ఆయనే రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) .. ఒకప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న వర్మ ఇప్పుడేమో వివాదాలకు అడ్డాగా మారాడు. ఇండస్ట్రీలో ఒక సినిమా వస్తుందంటే వర్మ ట్వీట్ కచ్చితంగా పడాల్సిందే. అటు రాజకీయాల్లో ఏదైనా చర్చ మొదలైతే వర్మ సోషల్ మీడియాలో వార్ జరగాల్సిందే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి మాటలు సరిపోవు రాయాలంటే పుస్తకాలు సరిపోవు. ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ప్రేక్షకుల మనసులో తన పేరును నానుతుంది. ఇదిలా ఉండగా వర్మ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశారు. అందులో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య( Aaradhya) కూడా ఒకరు.. మలయాళీ అయిన ఈమె తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది.. రీసెంట్ గా ఆరాధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో వర్మ టాలెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో వర్మపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ వర్మ చేసిన అంత గొప్ప పని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆరాధ్య సినిమాల్లోకి ఎలా వచ్చింది..?
మలయాళం ముద్దుగుమ్మ ఆరాధ్య ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వీడియోలు చేస్తూ పాపులారిటిని సొంతం చేసుకుంది.. ఆమె అందానికి ముగ్ధుడైన రామ్ గోపాల్ వర్మ ఆమెను ఎలాగైనా తన సినిమాలో హీరోయిన్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. వర్మ ఒకసారి ఫిక్స్ అయిపోతే ఇక కచ్చితంగా చేసి చూపిస్తాడని అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆ హీరోయిన్ ని దాదాపు ఆరేడు నెలలు ఫాలోఅప్ చేసి మొత్తానికి సినిమాలో హీరోయిన్గా ఒప్పించారు. ఇది ఆమెకు మొదటి సినిమా. అయితే ఈ సినిమా కోసం వర్మ చాలా కష్టపడ్డాడు. నా టాలెంట్ అంతా ఉపయోగించి హీరోయిన్ ను బుట్టలో వేసుకోవడమే కాదు హీరోయిన్ చేత శభాష్ అనిపించుకున్నాడు. దాంతో ఆమె రామ్ కు పెద్ద ఫ్యాన్ అయ్యింది. ఇక ఆమె పేరు కూడా నిజం కాదని చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
Also Read : ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ సీన్ లీక్.. క్లైమాక్స్ సీన్ లో ట్విస్ట్…
హీరోయిన్ పేరు మార్చిన ఆర్జీవి..
శారీ హీరోయిన్ అసలు పేరు ఆరాధ్య కాదని కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆమె అసలు పేరు శ్రీలక్ష్మి సతీష్.. చాలామంది సినిమాల్లోకి వచ్చాక తమ పేరును మార్చుకుంటున్నారు. కొంతమంది సినిమాల్లోకి రావడానికి పేరు మార్చుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈమె పేరు కూడా మారింది. ఇంటర్వ్యూలో హీరోయిన్ మాట్లాడుతూ.. నాకు శ్రీలక్ష్మి అనే పేరు మొదటి నుంచి ఇష్టం ఉండేది కాదు. ఒక సందర్భంలో నేను రామ్ కి ఈ విషయాన్ని చెప్పాను. ఆయన అర్జెంటుగా పేరు మార్చాలని అనుకున్నాడు. ఆ సినిమాలోని ఆమె క్యారెక్టర్ కు తగ్గట్లు ఆరాధ్య అనే పేరు పెడితే బాగుంటుందని వర్మ ఫిక్స్ అయ్యాడు. అదే విషయాన్ని ఆమెకి చెప్పడంతో ఆమె బాగుందని అంది. దాంతోవెంటనే ఆరాధ్య గా మార్చుకుంది. ఇక శారీ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. పాన్ ఇండియా రేంజ్‌లో ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రముఖ బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ తీశారు. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు.. శారీ కిల్లర్ కథ ఆధారంగా ఈ మూవీని తెరాకెక్కించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రముఖ బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ తీశారు. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు…