Naga Chaithanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి అందరికీ తెలుసు. ఈ ఏడాది తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు మించి కలెక్షన్స్ ను వసూల్ చేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.. సినిమాల సంగతి పక్కనపెడితే చైతూ తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. భారీ వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నఅక్కినేని హీరో.. ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు.. ఎన్టీఆర్ లాగా నేను కూడా చెయ్యాలని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలేం అన్నాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తండేల్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన చైతూ..
అక్కినేని హీరో నాగచైతన్య గత ఏడాది పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. ఈ ఏడాది భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. రియల్ స్టోరీ కావడంతో హిట్ అయ్యింది. ఈ మూవీ గురించి పలు ఇంటర్వ్యూలలో ఆయన చెప్పాడు. చాలా మంచి రిలీప్ ఇచ్చిందని, ఎంతో ఆనందంగా ఉన్నానని అన్నారు. కథ విన్నప్పటి నుంచే ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నా. ఆ స్టోరీలో ఎంతో మేటర్ ఉంది. పర్సనల్ గా నాకు లవ్ స్టోరీలు అంటే బాగా ఇష్టం. అందులోనూ రియల్ స్టోరీ బేస్ చేసుకొని రాసిన కథ. ఫిషర్ మ్యాన్ రోల్ ఇంతకముందెప్పుడూ చేయలేదు. నేను ఇక ముందు ఇలాంటి సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానను అని అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న చైతూ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.. ఎన్టీఆర్ ను ఇక ఫాలో అవుతానని చెప్పేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది..
Also Read :డబ్బుల కోసం ఆ తప్పు చేశాను..గుండె బరువెక్కేలా చేస్తున్న కౌశల్ స్టోరీ..
ఇంటర్వ్యూ లో నిజాన్ని బయట పెట్టిన చైతూ..
నాగ చైతన్య ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన తన సినిమాలతో పాటుగా బిజినెస్ ల గురించి బయట పెట్టాడు. హైదరాబాద్ లో ‘షోయు’ పేరుతో ఒక క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభించారు. అది సక్సెస్ ఫుల్ గా నడుస్తుండటంతో ఇటీవలే ‘స్కూజీ’ పేరుతో మరో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు.. ఆ రెండు రెస్టారెంట్లు సక్సెస్ అయ్యాయి. అయితే ఇటీవల ఎన్టీఆర్ నాగచైతన్య రెస్టారెంట్ గురించి జపాన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. జపనీలకు అక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయని అన్నాడు. దానిపై స్పందించిన నాగచైతన్య ఎన్టీఆర్ పై ప్రశంశలు కురిపించాడు. ఎన్టీఆర్ కి ఏం చేసినా అందులో ప్రత్యేకత ఉంటుంది. నా రెస్టారెంట్ గురించి అక్కడ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చైతు అన్నాడు. అంతేకాదు సినిమాల విషయంలోనూ ఫిట్నెస్ విషయంలోనూ ఇక ఎన్టీఆర్ ని ఫాలో అవుతానని ఆ ఇంటర్వ్యూలో నాగచైతన్య అన్నట్టు తెలుస్తుంది. అలాగే 20 గంటలు రెస్ట్ తీసుకుంటానని నాలుగు గంటలు మాత్రమే పని చేస్తానని తన సీక్రెట్ ని బయట పెట్టాడు చైతు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగచైతన్య పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాలు విషయానికొస్తే.. వార్ 2 తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కాంబీనేషన్లో సినిమా చేస్తున్నాడు.