BigTV English
Advertisement

Thandel Day 2 Collections: రెండో రోజు ‘తండేల్’ జోరు.. ఎన్ని కోట్లంటే..?

Thandel Day 2 Collections: రెండో రోజు ‘తండేల్’ జోరు.. ఎన్ని కోట్లంటే..?

Thandel Day 2 Collections: అక్కినేని యువ హీరో నాగచైతన్య నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం తండేల్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.. లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలను క్రియేట్ చేసుకొని థియేటర్లలోకి వచ్చింది. కానీ రిలీజ్ కు ముందున్న బజ్ ను రిలీజ్ అయ్యాక అందుకోలేదు. కథ బాగున్నా అక్కడక్కడా కొన్ని తప్పులు ఉన్నాయని అదే మూవీకి మైనస్ అయ్యాయాని ఓ వైపు ప్రచారం జరుగుతుంది.. ఒకవైపు యావరేజ్ టాక్ ని మరోవైపు నెగిటివ్ టాక్ ని అందుకున్న ఏ సినిమా కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. మొదటి రోజు 11 కోట్ల వరకు వసూలు చేసింది అలాగే రెండో రోజు మరో 10 కోట్లను వసూలు చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి తండెల్ మూవీ రెండు రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..


నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. తండేల్ సినిమా ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కించారు.. ఈ మూవీ ని శ్రీకాకుళంలోని మత్స్యకారుల జీవిత ఆధారంగా రూపొందించారు.. ఆ జిల్లాలోని ప్రజలు వల జీవన విధానాన్ని ఎలా గడుపుతున్నారు వాళ్ళు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు అనేది ఈ సినిమాలో కళ్ళ కట్టినట్లు చూపించారు. సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది. దాంతో ఈ సినిమాకు సెట్స్, రీసెర్చ్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో ఖర్చు కూడా భారీగా జరిగింది. అయితే మూవీకి మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. రెండో రోజు కూడా భారీగానే కలెక్షన్స్ ను వసూల్ చేసిందని సమాచారం..

తండేల్ రెండు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. మూవీ కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటింది. ఎవరూ ఊహించని విధంగా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసినట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు చిత్రయూనిట్.. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ నిలిచింది. అంతేకాకుండా.. ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా దుమ్ముదులిపింది.. రెండో రోజు వీకేండ్ కావడంతో కలెక్షన్స్ జోరు తగ్గలేదని తెలుస్తుంది. ఏపీ, నైజాంలో కనీసం 5 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 2 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి వరకు వసూల్ చేసి దాదాపు 10 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిందని తెలుస్తుంది. కొన్నేళ్లుగా హిట్ సినిమా పడని నాగ చైతన్య కు ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఇక ఈ వీకెండ్ ఇంకాస్త కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. చూడాలి ఎన్ని కోట్లు వసూల్ చేసి రికార్డు బ్రేక్ చేస్తుందో…


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×