Best Malayalam Thriller Movies on OTT : మలయాళం సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. థియేటర్లతోపాటు, ఓటీటీ లో కూడా ఈ సినిమాలు అదరగొడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన కిష్కింద కాండం లాంటి మలయాళం థ్రిల్లర్ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
పని (Pani)
2024లో విడుదలైన ఈ థ్రిల్లర్ సినిమా జోజు జార్జ్ దర్శకత్వం వహించాడు. ఆమ్ వర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజవంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో జోజు జార్జ్, అభినయ ప్రధాన పాత్రల్లో నటించారు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 13న విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ (Sony Liv) లో స్ట్రీమింగ్ అవుతోంది.
కిష్కింధ కాందం (Kishkindha Kaandam)
2024లో విడుదలైన ఈ మలయాళం మిస్టరీ మూవీకి దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయరాఘవన్ తదితరులు నటించారు. ఈ కథ కోతులు ఎక్కువగా నివసించే కల్లెపతి రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగుతుంది. ఆ ప్రాంతంలో మాజీ మిలిటరీ అధికారి అప్పు పిళ్లై, అతని కుమారుడు అటవీ అధికారి అజయ్ చంద్రన్ నివసిస్తూ ఉంటారు. అప్పు పిళ్లై కి మతి మరుపు ఉంటుంది. కనిపించకుండా పోయిన మనవడిని వెతికే క్రమంలో మూవీ స్టోరీ తిరుగుతుంది. 12 సెప్టెంబర్ 2024న విడుదలైన ఈ మూవీ కథ, స్క్రీన్‌ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రధాన తారాగణం నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా ఈ మూవీ విజయవంతమైంది. ప్రముఖ పాత్రలో నటించిన ఆసిఫ్ అలీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ కూడా ఇదే. 2024లో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ సినిమాల్లో ఒకటిగా కూడా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్ని +హాట్స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎ. ఆర్. ఎం (A. R. M)
2024లో విడుదలైన మలయాళ మూవీకి జితిన్ లాల్ దర్శకత్వం వహించగా, మ్యాజిక్ ఫ్రేమ్‌లు & యూజిఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా. జచారియా థామస్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఇందులో టోవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలైంది. ఈ మూవీ నవంబర్8 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్ని +హాట్స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆవేశం (Aavesham)
2024 లో రిలీజ్ అయిన ఈ మలయాళ యాక్షన్ కామెడీ మూవీకి జిత్తు మాధవన్ దర్శకత్వం వహించారు. ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్, అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్ దీనిని నిర్మించారు. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, హిప్‌స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్ మరియు సజిన్ గోపు నటించారు. బెంగళూరులోని ముగ్గురు యువకులు ఒక రౌడీపై ప్రతీకారం తీర్చుకోవడానికి, స్థానిక గ్యాంగ్‌స్టర్‌తో స్నేహం చేస్తారు. ఈ మూవీ 11 ఏప్రిల్ 2024న విడుదల అవ్వడంతో పాటు, దర్శకత్వం, యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, సంగీతం, సాంకేతిక అంశాలకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ₹30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ₹154 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్ని +హాట్స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.