Nagarjuna Akkineni : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో అక్కినేని అఖిల్ ఒకరు. అఖిల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హిట్ సినిమా చూడడానికి చాలా ఏళ్లు పట్టింది. ఎట్టకేలకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని రియల్ లైఫ్ లో కూడా అనిపించుకున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు ఒక ఇంటివాడు అయిపోయాడు. మామూలుగా సెలబ్రిటీస్ పెళ్లంటే మంచి హడావిడిగా జరుగుతుంది. కానీ అక్కినేని ఇంట్లో పెళ్లి మాత్రం సడి సప్పుడు లేకుండా జరిగిపోయింది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.
తన కుమారులతో నాగార్జున డాన్స్
నాగర్జున ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన్మధుడు అనే సినిమాతో నాగార్జున సినిమా చేసిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ లో కూడా నాగార్జునను చాలామంది మన్మధుడు అని పిలుస్తారు. ఈ ఏజ్ లో కూడా అంత అందంగా కనిపించడం అనేది మామూలు విషయం కాదు. అయితే అందంగా కనిపించడం మాత్రమే కాకుండా అదే ఎనర్జీని మైంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని కలిసి చేస్తున్న డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ఫొటోస్ ని వీడియోస్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
Also Read : Ar Rahman: ఆ ఆస్కార్ పాటను రెహమాన్ కంపోజ్ చెయ్యలేదు, ఇది అసలైన ట్విస్ట్