Nagarjuna: ఒక భాషలో సీనియర్ హీరోలుగా పేరు తెచ్చుకున్న నటీనటులు మరొక భాషలో నటించడం అనేది చాలా అరుదు. వారికి స్టార్ స్టేటస్ ఇచ్చిన భాషలో నటించడానికే సీనియర్ హీరోలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారిలో నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగ్. హీరోగా పరిచయమయినప్పటి నుండి ఎక్కువగా తెలుగు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడు హిందీ చిత్రాల్లో కూడా కనిపించి అలరించారు. అలాంటి నాగార్జున ఒక హిందీ మూవీలో కనిపించి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్‌తో కలిసి నాగార్జున బాలీవుడ్ ప్రాజెక్ట్ ఉండబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ ప్రాజెక్ట్
ఒకప్పుడు హిందీ సినిమాల్లో హీరోగా కూడా నటించారు నాగార్జున. కానీ మెల్లగా తెలుగుపైనే ఫోకస్ పెట్టడం మంచిది అనే ఉద్దేశ్యంతో బాలీవుడ్‌పై పెద్దగా దృష్టిపెట్టలేదు. అలా టాలీవుడ్ ప్రేక్షకులు ఆయనకు స్టార్ స్టేటస్ అందించారు. ఇప్పటికీ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాతోనే బిజీగానే ఉంటారు నాగ్. తను హీరోగా చివరిగా నటించిన ‘నా సామిరంగ’ కూడా కాస్త పరవాలేదనే అనిపించింది. అందుకే ప్రస్తుతం తన తరువాతి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కుబేర’ (Kubera)లో కీలక పాత్ర పోషిస్తూ బిజీగా ఉన్న నాగార్జున దగ్గరకు ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చిందని తెలుస్తోంది.
కీలక పాత్రకు ఓకే
బాలీవుడ్ దర్శకులంతా ఒక ఎత్తు అయితే.. రాజ్‌కుమార్ హిరానీ ఒక ఎత్తు అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. సోషల్ మెసేజ్ సినిమాలను ఎంటర్‌టైనింగ్‌గా చూపించడంలో ఈ డైరెక్టర్ ముందుంటారు. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమాలే ‘మున్నాభాయ్ ఎమ్ఎమ్‌బీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’. ఆ తర్వాత అదే ఫ్రాంచైజ్‌లో సంజయ్ దత్‌తో కలిసి మరిన్ని సినిమాలు చేస్తానని ముందుగానే మాటిచ్చాడు రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani). చెప్పినట్టుగా ఈ ఫ్రాంచైజ్‌లో మూడో సినిమా సిద్ధమవుతోందని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘మున్నాభాయ్ 3’ అనే టైటిల్‌తో రానున్న ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
Also Read: నాకు ఇష్టం లేనివారితో పనిచేయను.. తేల్చిచెప్పిన సోనమ్ కపూర్
చివరి సినిమా
చాలాకాలం తర్వాత నాగార్జున ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించారు. అదే ‘బ్రహ్మాస్త్ర’. ఆ సినిమాలో ఆయన కనిపించింది కాసేపే అయినా దాని ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్.. ఇలా స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున కూడా ఒక భాగమయ్యారు. ఇప్పుడు ‘మున్నాభాయ్ 3’లో కూడా నాగ్ నటించడానికి అంగీకరించడంలో ఆశ్చర్యం లేదని ఆడియన్స్ అనుకుంటున్నారు. కొన్నేళ్లుగా కేవలం హీరోగా మాత్రమే కాకుండా మల్టీ స్టారర్ సినిమాల్లో, సెకండ్ హీరో పాత్రల్లో కూడా నటించడానికి నాగార్జున వెనకాడడం లేదు. దానికి ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కుబేర’నే ఉదాహరణ. ప్రస్తుతం నాగార్జున (Nagarjuna) చేతిలో ‘కుబేర’ తప్పా వేరే ప్రాజెక్ట్ లేదు.