BigTV English

Naa Saami Ranga OTT Release Date: ఓటీటీలోకి సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. ఫిబ్రవరి 17 నుండి స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Naa Saami Ranga OTT Release Date: ఓటీటీలోకి సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. ఫిబ్రవరి 17 నుండి స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

King Nagarjuna’s ‘Naa Saami Ranga’ Movie OTT Release date: కింగ్ నాగార్జున హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఓ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. విజయ్ బిన్ని దర్శకత్వంలో ‘నా సామిరంగ’ అనే మూవీతో ప్రేక్షకాభిమానులను పలకరించాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయింది.


మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. ఇక అదే సమయంలో మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’ నుంచి గట్టి పోటీ ఉన్నా.. అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లను రాబట్టింది.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. కాగా ఈ మూవీలో నాగార్జున సరసన యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించి.. తన అందంతో సినిమాకే వన్నె తెచ్చింది.


READ MORE: Naa Saamiranga Movie :  నా సామిరంగా .. ఈ ఏజ్ లో కూడా జోరు తగ్గని నవ మన్మధుడు..

అలాగే అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ వంటి నటీ నటులు ఇందులో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. అంతేకాకుండా ఆస్కార్ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి అందించిన మ్యూజిక్ అందరినీ ఆకర్షించింది.

ఇక థియేటర్లలో అందరినీ విపరీతంగా అలరించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి అదిరే సర్ప్రైజ్ వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ‘డిస్నీప్లస్ హాట్‌స్టార్’ సొంతం చేసుకుంది.

READ MORE: Naa Saamiranga Review : నా సామిరంగ.. కింగ్ నాగార్జునకు సంక్రాంతి మళ్లీ కలిసొచ్చిందా ?

దీంతో ఈ సినిమా ఫిబ్రవరి 15న స్ట్రీమింగ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. ఈ మూవీ ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో థియేటర్లలో ఈ మూవీని మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×