BigTV English
Advertisement

Uday Saharan: ప్రతీకారాలు మనకెందుకు? మ్యాచ్ గెలుద్దాం.. కెప్టెన్ ఉదయ్..!

Uday Saharan: ప్రతీకారాలు మనకెందుకు? మ్యాచ్ గెలుద్దాం.. కెప్టెన్ ఉదయ్..!
sports news headlines

Uday Saharan news(Sports news headlines): అండర్ 19 మ్యాచ్‌లో టీమ్ ఇండియా కుర్రాళ్లు ఫైనల్స్‌కి చేరి సంచలనం సృష్టించారు. అయితే టీమ్ ఇండియాకి ప్రత్యర్థిగా మళ్లీ ఆస్ట్రేలియా వచ్చేసరికి అందరిలో అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రడీ సీనియర్స్ గత ఏడాది రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో గట్టి దెబ్బలు తిన్నారు.


రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తొలుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో, తర్వాత జరిగిన వన్డే వరల్డ్‌కప్‌‌తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అంతకుముందైతే లెక్కేలేదు.

కుర్రాళ్ల విషయానికి వస్తే 2018, 2012లో ఇండియా-ఆస్ట్రేలియా  ఫైనల్‌లో తలపడ్డాయి. రెండుసార్లు ఇండియా విజేతగా నిలిచింది. ఈ లెక్కన చూస్తే ట్రాక్ రికార్డ్ ఇండియాకే ఫేవర్‌గా ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కెప్టెన్ ఉదయ్ సహరన్‌ను మీడియా ఒక ప్రశ్న వేసింది. దానికి తనిచ్చిన సమాధానం చూసి బిత్తరపోవడం వారి వంతైంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే..


ఆస్ట్రేలియా జట్టు సీనియర్లను ఓడించింది కదా.. దానికి బదులుగా ఇక్కడ మీరు ప్రతీకారం తీర్చుకుంటారా?  అని ఉదయ్‌ను ప్రశ్నించారు. దానికి ఒక తెలివైన సమాధానం ఇచ్చాడు. తనేమన్నాడంటే..

Read More: Under-19 World Cup 2024: అండర్ 19 వరల్డ్ కప్ నుంచి.. టీమ్ ఇండియా వరకు..

రివెంజ్ అనేది తమ పరిధిలో లేని విషయం అన్నాడు. ఆటలో గెలుపు, ఓటములు సహజమని తెలిపాడు. నిజానికి మా మనసుల్లోనే కాదు, ఏ ఆటగాడి మనసులో కూడా రివెంజ్ అనేదే ఉండదని అన్నాడు. అవన్నీ మన పరిధిలోనివి కావు, అయిపోయిన మ్యాచ్‌ల గురించి ఆలోచిస్తూ, రీవెంజ్ అంటూ పోతే, క్రీజులో దెబ్బతింటామని అన్నాడు. ఆ ఒత్తిడి ఆటకు మంచిది కాదని అన్నాడు.

ఆటలో ఎప్పుడు గెలుపుపైనే ఫోకస్ ఉండాలని అన్నాడు. మేం ఇప్పుడు రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌పై వ్యూహాలు రచిస్తున్నామని అన్నాడు. రేపు ఆస్ట్రేలియా బౌలర్లను ఎలా ఎదుర్కోవాలి? అలాగే వారిలో స్టార్ బ్యాటర్లను ఎలా అవుట్ చేయాలి? పిచ్‌కు తగినట్టు ఎలా ప్రిపేర్ కావాలి? అలాగే జట్టులో క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఆడాలి?  వీటిపై గ్రూప్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయని, కోచ్‌లు సలహాలిస్తున్నారని అన్నాడు. ప్రాక్టీస్ కూడా అలాగే చేస్తున్నామని తెలిపాడు.

ఇలా ఎన్నో సవాళ్లు మా ముందుంటే, ప్రతీకారాల కోసం ఎందుకు ఆలోచిస్తామని అన్నాడు. మేం మా గేమ్‌పై మాత్రమే దృష్టి పెడతాం. అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకే చూస్తామని అన్నాడు. వరల్డ్ కప్‌లో ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదేనని అన్నాడు. ఇక్కడ అన్ని టీమ్స్ బాగానే ఆడాయని క్రీడా స్ఫూర్తితో తెలిపాడు.

ఈ మెగా టోర్నమెంట్ గెలవాలన్నది ప్రతీ క్రికెటర్ కల. దానిని సాకారం చేసుకోవడానికి వచ్చాం. మాకు ఇక్కడ ఉన్నది ఆఖరి ఛాన్స్. మేం మళ్లీ చరిత్ర సృష్టించాలి. మా పేర్లు చరిత్రలో నిలిచిపోవాలని ఉదయ్ సహరన్ అన్నాడు. మరి మన అండర్ 19 కెప్టెన్ కల సాకారం కావాలని మనం కూడా కోరుకుందాం.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×