BigTV English

Nagarjuna:  ఆ విషయంలో చైతూ సూపర్.. సంతోషంలో నాగార్జున.. ఏమైందంటే?

Nagarjuna:  ఆ విషయంలో చైతూ సూపర్.. సంతోషంలో నాగార్జున.. ఏమైందంటే?

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయకపోయిన స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. నాగార్జున సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలాకాలం అయింది. ఇటీవల కాలంలో ఈయన ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు. ఇక చివరిగా నాగార్జున హీరోగా నా సామిరంగా అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వంటి వారు నటించారు. ఇకపోతే నాగార్జున కుబేర (Kubera) సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగార్జున తన తదుపరి సినిమాల గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి ఇకపోతే తన కొడుకుల కెరియర్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక త్వరలోనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో కూడా నాగార్జున నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని, ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

మాస్ లుక్..


ఇకపోతే నాగార్జున తాజాగా తన కుమారుడు నాగచైతన్య(Nagachaitanya) సినిమాల గురించి పలు విషయాలను వెల్లడించారు. నాగార్జున వారసుడిగా జోష్ అనే సినిమా ద్వారా నాగచైతన్య హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ మొదటి సినిమాతో సక్సెస్ అందుకోలేక పోయిన రెండో సినిమా ఏం మాయ చేసావే సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చైతన్య వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ టైర్ టు హీరోలలో స్టార్ గా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల నాగచైతన్య తండేల్(Thandel) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు..

ఈ సినిమాలో నాగచైతన్య ఎప్పుడు కనిపించని విధంగా మాస్ లుక్ లో కనిపించారు. ఇక ఈ సినిమాలో పెద్ద ఎత్తున యాక్షన్ సన్ని వేశాలలో కూడా చైతూ నటించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పుడూ చైతు ఈ విధమైనటువంటి మాస్ పాత్రలలో చేయలేదు. ఈ సినిమా ద్వారా తనలో ఉన్నటువంటి కొత్త టాలెంట్ బయట పెట్టారని ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి నాగచైతన్య ఇలాంటి మాస్ పాత్రల కంటే కూడా ఎమోషనల్ సన్నివేశాలలో చాలా అద్భుతంగా నటిస్తారు. ఏ మాయ చేసావే సినిమా నుంచి మొదలుకొని చైతు ఎమోషనల్ సీన్స్ తో చాలా బాగా కనెక్ట్ అవుతూ సూపర్ గా నటిస్తారంటూ తన కొడుకు నటన గురించి నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×