BigTV English

Odisha: ఒడిశాలో దారుణం.. యువకుడు ప్రేమ పెళ్లి, 40 మందికి శిరోముండనం

Odisha: ఒడిశాలో దారుణం.. యువకుడు ప్రేమ పెళ్లి, 40 మందికి శిరోముండనం

Odisha: తమ గ్రామానికి చెందిన యువకుడు మరొక కులానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడం ఆ గ్రామ పెద్దలకు నచ్చలేదు. గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించారంటూ యువతి కుటుంబసభ్యులపై రుసరుసలాడారు. వారిని ఊరి నుంచి వెలి వేయకుండా ఊహించని విధంగా శిక్ష విధించారు. ఈ ఘటన ఒడిషాలో వెలుగు చూసింది.


ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి అమానుష ఘటనకు వేదికైంది. యువతి కుటుంబసభ్యులను ఊరి వెలి శిక్ష నుంచి తప్పించుకునేందుకు కుటుంబంలోని దాదాపు 40 మంది పురుషులు శిరోముండనం చేశారు ఆ గ్రామ పెద్దలు. స్థానిక గోరఖ్‌పూర్‌ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, షెడ్యూల్డ్‌ కులానికి చెందిన యువకుడు ప్రేమించింది.

చివరకు వీరిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి తరపు వారు ఈ పెళ్లి ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ప్రేమికులు మూడు రోజుల కిందట వివాహం చేసుకున్నారు. ఆ జంట రెండురోజుల కిందట గ్రామానికి వచ్చింది. ప్రేమ జంట తమ ఊరికి వచ్చిన విషయం గ్రామ పెద్దలకు తెలిసింది.


ఆ గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యులను వెలివేశారు. ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయం ఆలోచించారు. వెలికి బదులుగా శిరోముండనం చేయించుకోవాలని నిర్ణయించారు.  అందుకు యువతి కుటుంబసభ్యులు ఓకే చెప్పారు. ఎందుకంటే యువతికి పెళ్లికి వారి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అలాగే మూగ జీవాలను బలిచ్చి నూతన జంటకు పెద్ద కర్మ చేయాలని డిసైడ్ అయ్యారు.

ALSO READ: 1206.. చివరకు చావు కూడా లక్కీ నెంబర్‌తోనే

చేసేదేమీ లేక యువతి కుటుంబసభ్యులు, బంధువులు దాదాపు 40 మంది పురుషులు శిరోముండనం చేయించుకున్నారు.  గ్రామ కట్టుబాట్లు ప్రకారం మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి పూజలు చేశారు. ఈ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులను మీడియా ప్రతినిధులు అడిగారు. తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

అసలే అమ్మాయిలు దొరక్క రోజు రోజుకూ పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో గ్రామ పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చాలామంది మండిపడుతున్నారు. జీవితాంతం కలిసి ఉండేది వాళ్లేనని, మీ జోక్యం ఏంటని ప్రశ్నించినవాళ్లు లేకపోలేదు. గ్రామ పెద్దల తీర్మానానికి ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. తీర్మానం మేరకు శిరోముండనం చేయించుకున్నారు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×