Intinti Ramayanam Today Episode February 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. భానుమతిని అడ్డుపెట్టుకోవాలని అవనిని ఇంట్లోకి రానివ్వకుండా చెయ్యాలని అనుకుంటుంది పల్లవి. నేను ఇంటికి పెద్దదాన్ని కానీ నా మాట ఎవరు వినరు నువ్వు నీ తోడికోడలు శ్రీయను నీ వైపు తిప్పుకో రేపు ఏదైనా తప్పు జరిగిన దానిమీద తోసేసి నువ్వు బయటపడొచ్చు అని భానుమతి సలహా ఇస్తుంది. శ్రియా రావడం చూసి పల్లవి డ్రామాలు మొదలు పెడుతుంది.. శ్రీయను బుట్టలో వేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. నిజానికి శ్రీకర్, శ్రీయాకు పల్లవి గురించి ముందే చెప్తాడు కాబట్టి శ్రీయా నమ్మినట్టు కనిపించదు. పల్లవి అన్నమాట శ్రీకర్తో శ్రీయా అంటుంది. పల్లవి ఎందుకు సడన్గా ఇలా మారిపోయింది అంటే నిన్ను అడ్డుపెట్టుకొని అవని వదినను ఇంటికి రానివ్వకుండా చేయాలని అనుకుంటుంది నువ్వు ఏమాత్రం కరిగావో ఇక తప్పు మీద తప్పులు చేసి నీ మీదకు తో వస్తుందని శ్రీకర్ శ్రీయకు వార్నింగ్ ఇస్తాడు. లాయర్ కూతుర్ని ఇప్పుడు లాయర్ భార్యని నన్నే మోసం చేయాలని చూస్తే అస్సలు సహించను అని శ్రియ అంటుంది. నువ్వు ఎంత తెలివిగా ఉన్నా కూడా పల్లవి ఎత్తులు ముందు నువ్వు వెయ్యలేవు అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానని శ్రీకర్ చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ఒక ఆఫీస్ కి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్తాడు. అవని చూసి మనసులో అవని పై ప్రేమను కురిపిస్తాడు. ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి అక్షయ్ ని ఎలాగైనా దెబ్బ తీయాలని అనుకుంటుంది. టిప్స్ కోసం అని అడిగి లోపలికి తీసుకెళ్తుంది. తనతో మాట్లాడుతూ నేను మీకు పెద్ద ఫ్యాను మీ బిజినెస్ స్కేల్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి మీరంటే నాకు పిచ్చి ఎక్కువ చేశాయి మీరు నన్ను ఎలా వాడుకున్న పర్లేదు అనేసి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది.. కానీ దానికి ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో తనని బలవంతం చేయబోయాడని డ్రామాను మొదలు పెడుతుంది.. అవని ఆ విషయాలని నమ్మదు.. అయితే అక్షయ్ ని అక్కడ ఉన్న వాళ్ళందరూ తిడతారు. మీరు ఎంతో పెద్దమనిషిని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాము కానీ మీరు ఇలాంటి చీప్ బిహేవియర్ అని అర్థం కాలేదు అనేసి అతను అనగానే ఆగండి సార్ అని అవని వస్తుంది. నేను ఫ్లవర్ డెకరేషన్ చేసేటప్పుడు అన్ని రూమ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి చూసాను ఒకసారి ఎవరిని తప్పో చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అవుతుంది కదా అనేసి అంటుంది. ఇక దానికి అక్కడున్న వాళ్ళందరూ సిసి టీవీ ఫుటేజ్ ని చూడాలని అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి వద్దు చూడద్దు అని అంటుంది ఎందుకు వద్దు అతను చేసిన తప్పే కదా అతని చూసి పోలీసులకు ఈ వీడియో చూపిస్తే అతని అరెస్ట్ చేస్తారు అతని పరువు తీస్తారు అంతే కదా అనేసి అవని అంటుంది.
ఆ అమ్మాయి మాత్రం అక్షయ్ సార్ తప్పేమీ లేదు అక్షయ్ సార్ మీద ప్రేమతోనే నేను ఇలా చేశాను. అని నిజం ఒప్పుకుంటుంది. అది విన్నా అవని ఆ అమ్మాయి చెంప పగలగొడుతుంది. ఆడదానిమని సంగతి నువ్వు మర్చిపోవద్దు అది ఆలోచించు అనేసి అంటుంది. మగాడి మీద మచ్చ పడితే అది మగాడు అని వదిలేస్తారు అదే ఆడదాని మీద మచ్చ పడితే జీవితాంతం నిందలు వేస్తారు ఇది గుర్తుపెట్టుకుంటే పైకొస్తావ్ అనేసి అంటుంది. ఆఫీసులో వాళ్ళని కూడా అక్షయ్ గురించి చెప్తూ తిడుతుంది. ఇక భానుమతి మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటుంది. కమల్ గులాబ్ జామ్ తింటుంటాడు. భానుమతి ఆ వాసనకి కమల్ దగ్గరికి వెళ్తుంది అయితే కమ్మలు గులాబ్ జామ్ ను ఇస్తాడు. ఇక కమ్మలు భానుమతిని ఆట ఆడుకుంటాడు భానుమతి మాత్రం తన భర్త ఫోటో దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది.. అది కాస్త కమల్ ప్లాన్ అని అర్థమయిపోతుంది. భానుమతి కమలిని చూసి ఇకమీదట మిమ్మల్ని మర్యాదగా చూసుకుంటానని చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అక్షయ్, అవని ఇద్దరు కలిసి రోడ్డు మీద మాట్లాడుకుంటారు. గదిలో లోపల ఏం జరిగిందో కూడా తెలీదు కానీ నువ్వు ఎలా నేను తప్పు చేయలేదని నమ్మావు అంటే మీ మీద నాకున్న నమ్మకం అని అవని అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే..