Kingdom release date : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి హైప్ తో తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ తిననూరి చేస్తున్న సినిమా కావడంతో దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి జెర్సీ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం ఇదే సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి నాగ వంశీ ఎప్పుడు ప్రస్తావించినా ఇది వేరే లెవెల్ లో ఉండబోతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉంటారు. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి రివ్యూలు ఇచ్చిన కూడా పర్లేదు అని చాలా స్ట్రాంగ్ గా కొలుసార్లు తెలిపాడు నాగ వంశీ. ఇక ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేశారు.
రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక ఈ సినిమాను జూన్ లో విడుదల చేస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇప్పుడు జులై 25 కి పోస్ట్ పోన్ అవుతున్నట్లు విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రానుంది. ఇక ఈ సినిమా రెండు పార్ట్స్ లో రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాలు సెకండ్ పార్ట్ అవసరం లేకపోయినా కూడా చేస్తున్నారు. కానీ ఈ సినిమా కథను మొదటి వినిపించినప్పుడే ఇది రెండు పార్ట్స్ లో చేయాలని ఫిక్స్ అయ్యారట. మొదటి కథ విన్నప్పుడు నాగవంశీకి ఒక హై వచ్చింది. గౌతమ్ ఒక పాయింట్ వరకు చెబుతూ ఇది ఫస్ట్ పార్ట్ సార్ అని తెలిపాడట. మొదలు పెట్టిన తర్వాత రెండు పార్ట్స్ చేయడం కాకుండా, ముందుగానే 2 పార్ట్స్ అని ఫిక్స్ అయి ఈ సినిమా మేకింగ్ లోకి దిగారు.
నెవర్ బిఫోర్ అవతార్
విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముందుగా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ ను స్టార్ హీరోని చేసేసింది. అలానే గీతగోవిందం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే గత కొన్ని రోజులుగా విజయ్ సక్సెస్ చూసిన దాఖలాలు లేవు. ఇకపోతే విజయ్ ఇంతకుముందు ఎప్పుడు కనిపించిన విధంగా ఈ సినిమాలో రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. విజయ్ లుక్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు కూడా మరింత పెరిగాయి.
Also Read : Kuberaa : ఈ సినిమాలో బెగ్గర్ రోల్ కోసం చాలా రీసెర్చ్ చేశాను