BigTV English

Akkineni Nagarjuna : ‘పుష్ప’ మూవీపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. సౌత్ కంటే నార్త్‌లోనే అంటూ..

Akkineni Nagarjuna : ‘పుష్ప’ మూవీపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. సౌత్ కంటే నార్త్‌లోనే అంటూ..

Akkineni Nagarjuna : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల పైన ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా రూపురేఖలు కంప్లీట్ గా మారిపోయాయి. అలానే టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లో కూడా తమ హవా కొనసాగిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను అనిమల్ సినిమాతో షేక్ చేశాడు. చాలామంది సీనియర్ జర్నలిస్టులకు తలనొప్పిగా మారాడు. చాలామంది తెలుగు దర్శకులు ఇవ్వని ఆన్సర్ బాలీవుడ్ సినీ ప్రముఖులకు ఇచ్చాడు. ఇక పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. దానికి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.


నార్త్ లో బ్రహ్మరథం పట్టారు

మొదటి పుష్ప సినిమా విడుదలైనప్పుడు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు సుకుమార్ సినిమాలకు వచ్చినట్లు మిశ్రమ స్పందన మొదటి షోకి వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వస్తున్న కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా ఎక్కింది. నార్త్ లో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. పుష్పరాజ్ అనే పాత్ర విపరీతంగా పాపులర్ అయిపోయింది. చాలామంది క్రికెటర్స్, పొలిటిషియన్స్ పుష్పరాజ్ డైలాగులు చెప్పడంతో ఆ సినిమాకి ఇంకా పాపులారిటీ లభించింది. ఆ సినిమాకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిన విషయమే.


నార్త్ లో ఆడడానికి కారణం

తెలుగు సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున వేవ్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ తెలుగులో కంటే కూడా హిందీలో పుష్ప సినిమా భారీ హిట్ అవ్వడానికి కారణాలను తెలిపారు. మామూలుగా నాకు సౌత్ ఆడియన్స్ నార్త్ ఆడియన్స్ అని అనడం ఇష్టం ఉండదు కానీ తప్పట్లేదు. నార్త్ ఆడియన్స్ పుష్పరాజ్, రాఖీ బాయ్ లాంటి క్యారెక్టర్ ని చూసినప్పుడు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు అది మామూలు అయిపోయింది. వాళ్లు ఇదివరకే అలాంటి పాత్రలను చూడటం వలన పెద్దగా ఎక్సైట్ కాలేకపోయారు. లార్జెర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ చూడటం బాలీవుడ్ ప్రేక్షకులకి కొత్తగా అనిపించింది. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాను చాలా ఒరిజినల్ గా తెరకెక్కించారు అందుకే అది చాలామందికి విపరీతంగా నచ్చింది. మన కథలను జెన్యూన్ గా చెప్పినప్పుడు అవి అద్భుతంగా వర్క్ అవుట్ అవుతాయి అంటూ మాట్లాడారు నాగార్జున.

Also Read : Raid 2 1st Day Collections: బాలీవుడ్ ఊరట, రెయిడ్ 2 కలెక్షన్లు ఎంత అంటే.?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×