Magic Movie : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుద్ రవిచంద్రన్ ఒకరు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన త్రీ సినిమాతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్. ఆ సినిమా రిలీజ్ కంటే ముందే ధనుష్ పాడిన కొలవరెడి పాట అప్పట్లో సంచలనం గా మారింది. కేవలం ఈ పాట కోసమే థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే సినిమా మాత్రం ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ అనిరుద్ మాత్రం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిర పడిపోయాడు. ఇప్పటికీ అనిరుద్ మ్యూజిక్ కి ఒక రేంజ్ ఉంటుంది. ఒక మామూలు సీన్ కు కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో భారీ ఎలివేషన్ వచ్చేలా చేయగలడు. ఇక కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు అనిరుద్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన 25వ సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమా ఆల్బమ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రతి పాట ఒక మంచి ఫీల్ క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో జెర్సీ అనే ఒక సినిమాకు సంగీతం అందించాడు అనిరుద్. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. నేను అజ్ఞాతవాసి సినిమాకు పని చేసినప్పుడు అనిరుద్ తో కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా నన్ను అనిరుద్ ఇబ్బంది పెట్టలేదు. అనిరుద్ వలన మేము రిలీజ్ డేట్ మార్చిన దాఖలాలు లేవు అంటూ తెలిపాడు.
ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ 12వ సినిమాను నిర్మిస్తున్నాడు నాగ వంశీ. ఈ సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. గౌతం తిన్న నూరి ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు మ్యాజిక్ అనే ఒక సినిమాను చేస్తున్నాడు గౌతమ్. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడుపాటల్లో ఆరు పాటలు అనిరుద్ ఆల్రెడీ ఇచ్చేసారట. కేవలం ఒక పాట మాత్రమే పెండింగ్ ఉంది. పాటను కూడా త్వరలో అనిరుద్ ఇవ్వనున్నాడు. అయితే రీసెంట్ ట్రెండ్ లో వస్తున్న ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగల్ అలా కాకుండా మొత్తం అన్ని పాటల్ని ఒకేసారి రిలీజ్ చేస్తారు చిత్ర యూనిట్. ఈ రిలీజ్ చేసిన ఆడియో తో కొన్ని రోజుల తర్వాత అనిరుద్ కన్సర్ట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాడు నాగ వంశీ. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఆంక్షలు వలన ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.
Also Read : Naveen Polishetty : మామూలు టాలెంట్ కాదు, ఆ వాయిస్ కూడా తనదే