MLA Sabitha IndraReddy Food Poisoning| తెలంగాణ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రా రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ఎర్రవెల్లిలోని కేసిఆర్ ఫామ్ హౌస్ సమావేశం నుంచి తిరిగి వస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు.
ఫామ్ హౌస్ నుంచి వస్తున్న సమయంలో ఎమ్మెల్యే సబితా రెడ్డి అరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) కార్యకర్తలు వెంటనే ఆర్ విఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో సబితా రెడ్డికి డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు తేల్చారు.
Also Read: మహిళల కుటుంబ భరోసాకు రూ.10 లక్షలు.. ప్రకటించిన ప్రభుత్వం
శుక్రవారం ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు చెందిన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి వెళ్లారు. అక్కడ బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఆమె పాల్గొన్నారు. అయితే తిరుగు ప్రయాణంలో ఆమె అరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సబితా ఇంద్రా రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా విజయం సాధించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సబితా రెడ్డి.. బిఆర్ఎస్ ప్రభుత్వంలో 2019-2023 వరకు విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
రజతోత్సవ వేడుకలపై బిఆర్‌ఎస్ సన్నాహక సమావేశం
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఎర్రెవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి కేటీఆర్, హరీశ్‌రావు, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, కేఆర్ సురేశ్, బండా ప్రకాశ్, సబితా ఇంద్రారెడ్డి, కవిత, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వినోద్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేశపతి శ్రీనివాస్, శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.