Namrata Shirodkar:నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) నేటి కాలం యువతకు ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) భార్య గానే తెలుసు. కానీ 90 కిడ్స్ కి ఈమె ఎవరో, ఈమె టాలెంట్ ఏంటో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేరు.. 1993లోనే మిస్ ఇండియా గా ఎంపికయి.. తన అందంతో అందరిని కట్టిపడేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా సందడి చేసింది నమ్రత. మొదట రూపదర్శిగా పని చేసిన నమ్రత.. ఆ తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించి, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మహారాష్ట్ర, ముంబైలో 1972 జనవరి 22న జన్మించింది. మిస్ ఇండియా గా ఎంపికైన ఈమె.. 1998లో హిందీలో తొలిసారి ‘జబ్ ప్యార్ కిసీ సే హోతా హై’ అనే సినిమా ద్వారా తన నటన కెరియర్ ను ఆరంభించింది. బాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈమె.. కన్నడలో ‘చోర చిత్త చోర’, మలయాళం లో ‘ఎఝుపున్న తారకన్’ అనే సినిమాలో కూడా నటించింది.
20 ఏళ్లుగా నటనకు దూరం..
ఇకపోతే అలా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తెలుగులో 2000 సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వంశీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారి, 2005 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ఇకపోతే వివాహానికంటే ముందే చిరంజీవి (Chiranjeevi)తో ‘అంజి’ సినిమాలో చేసిన ఈమె.. మళ్లీ మహేష్ బాబుతో ‘టక్కరి దొంగ’ అనే సినిమాలో కూడా నటించింది.
ఇకపోతే వివాహం తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తుందని, సినిమాలు చేస్తుందని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. కానీ అభిమానులకు నిరాశే మిగిలింది. 2005లో ఇండస్ట్రీకి స్వస్తి పలికిన నమ్రత.. ఇప్పటివరకు అంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా నటనకు పూర్తిగా దూరమయిందనే చెప్పాలి.
కుటుంబమే జీవితంగా..
భర్త బిజినెస్ వ్యాపారాలను చూసుకుంటూనే.. మరొకవైపు భర్తకు సంబంధించిన సినిమా విషయాలను కూడా దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటుంది నమ్రత. మహేష్ బాబు వేసుకునే దుస్తులను మొదలుకొని ఆయన ప్రతి మూమెంట్లో కూడా ఆమె హస్తం ఉంటుందని చెబుతూ ఉంటారు. మరొకవైపు పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే.. తన కూతురు సితార బ్రాండ్ ఎండార్స్మెంట్లకు కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఇలా అన్ని బాధ్యతలు చేపట్టిన ఈమె తనకంటూ సొంత కెరియర్ ను దూరం చేసుకుందనే చెప్పాలి. దీంతో మహేష్ అభిమానులు కూడా.. నమ్రతా మీ కెరియర్ గురించి ఆలోచించుకోండి అంటూ చెబుతూ ఉంటారు.
సినీ ఎంట్రీకి సిద్ధమైన నమ్రత..
అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా మళ్లీ పాత రోజులను గుర్తు చేసింది ఈ ముద్దుగుమ్మ. గతంలో మిస్ యూనివర్స్ పోటీల్లో తన అందంతో ఎలా అయితే ఆకట్టుకుందో అచ్చం అలాగే తయారయ్యి.. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఆ ఫోటోలను పంచుకుంది. ఇది చూసిన అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. త్వరలోనే నమ్రత సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది.. అందుకే ఇదంతా చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాదు నమ్రత ఇటీవల మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. వారిని చూసాక.. మళ్లీ తనకి పాత రోజులను గుర్తుకు వచ్చాయో ఏమో .. అందుకే ఇప్పుడు తనకంటూ ఒక కెరియర్ను బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయబోతోంది. అందులో భాగంగానే ఇలాంటి ఫోటోలు షేర్ చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నమ్రత చాలా రోజుల తర్వాత ఇలాంటి గెటప్ లో కనిపించి అందరిలో అనుమానాలు రేకెత్తించింది.
ALSO READ:Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. షైన్ టామ్ చాకో తండ్రి మృతి!