Namrata Shirodkar: బాలీవుడ్ హీరోయిన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు మహేష్ బాబు భార్యగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తుంది.. అలాగే మహేష్ బాబు సినిమా వ్యవహారాలను చూసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల ఫోటోలను, మహేష్ బాబు సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా ఉండగా ఈమె నటించిన బాత్రూమ్ సాంగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సాంగ్ ఏంటి? మూవీ పేరేంటో తెలుసుకుందాం..
నమ్రత బాలీవుడ్ లో సినిమాలు చేసింది.. తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు కానీ బాలివుడ్ లో మాత్రం అమ్మడు రేంజ్ వేరే లెవల్.. ఈమె సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, సంజయ్ దత్, అక్షయ్ కుమార్-సునీల్ శెట్టితో సహా చాలా మంది ప్రముఖులతో కలిసి నటించింది. నమ్రతా శిరోద్కర్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో సైఫ్ అలీఖాన్ సరసన జోడిగా నటించింది. ఆ మూవీలో స్టార్ హీరో అజయ్ దేవగన్, మనీషా కొయిరాలా కూడా ఉన్నారు. ఆ మూవీ పేరు ‘కచ్చే ధాగే’.. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్, నమ్రత మధ్య ఓ బాత్రూం సాంగ్ ఒకటి ఉంది.. పాట చర్చనీయాంశమైంది. 1994 లో విడుదలైన ‘కచ్చే ధాగే’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. కానీ సైఫ్ అలీ ఖాన్ , నమ్రతా శిరోద్కర్‌లపై చిత్రీకరించిన ‘ఏక్ జవానీ తేరీ ఏక్ జవానీ మేరీ’ చాలా హిట్ లిస్టులో నిలిచింది. ఈ పాటలో నమ్రత చాలా బోల్డ్ గా నటించింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.
అయితే ఈ పాటలో నమ్రతా శిరోద్కర్, సైఫ్ అలీ ఖాన్ కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఆ సమయంలో మీరు ఈ పాటను కుటుంబంతో చూడలేరు. పాట రాగానే జనాలు కాసేపు ఛానెల్ మార్చడం లేదా టీవీ ఆఫ్ చేయడం చేసారు.. అంతే అర్థం చేసుకోవచ్చు పాటలో ఎంత బోల్డ్ సన్నివేశాలు కనిపిస్తాయో.. ఆ కాలంలో ఇలాంటి పాటలు రావడం అంటే జనాలు తల దించుకొనేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అలాంటి సాంగ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూసేవాళ్లకు కామన్ అయిపోయింది.. ఆ సాంగ్ ఇప్పటికి వైరల్ అవుతుంది. ఇక మహేష్ బాబుతో పెళ్లి తర్వాత భర్తతో కలిసి యాడ్స్ చేస్తుంది. తప్ప సినిమాలు చెయ్యలేదు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది గుంటూరు కారం సినిమా చేశాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌలితో సినిమా చేస్తున్నాడు.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది…