Razakar OTT Release Date:అనసూయ(Anasuya).. మొదట ఎన్టీఆర్ (NTR)హీరోగా నటించిన ‘నాగ’ అనే సినిమాలో సునీల్(Sunil)వెనుక క్యారెక్టర్ లో నటించి, వెండితెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం రావడంతో యాంకర్ గా అవతరించి, దాదాపు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేసి భారీ పాపులారిటీ అందుకుంది. అలా అనసూయ ఒకవైపు యాంకరింగ్ తో అదరగొట్టి, ప్రస్తుతం సినిమాల్లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. అలా అనసూయ తాను నటించే సినిమాల్లో.. తన పాత్రలతో మంచి గుర్తింపు లభించడమే కాకుండా రంగమ్మత్త (Rangammattha), దాక్షాయిణి (Dakshayini)వంటి పాత్రలు గుర్తింపుని ఇచ్చాయి.
అనసూయ రజాకార్ మూవీ..
రామ్ చరణ్(Ram Charan) ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రలో, ‘పుష్ప’ సినిమాలో దాక్షాయిణి పాత్రలో అనసూయ అదరగొట్టేసింది అని చెప్పుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ అందాలతో కుర్రకారుకి మత్తెక్కిస్తూ సినిమాల్లో కూడా తన నటనతో అందర్నీ అలరిస్తోంది.అయితే అలాంటి అనసూయ నటించిన ‘రజాకార్’ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీ ఎన్నో వివాదాల మధ్యలో గత ఏడాది మార్చి 15న విడుదలైంది. ఇక ఈ సినిమా విడుదల కాకుండా చూడడానికి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుపడినప్పటికీ మరికొన్ని రాజకీయ పార్టీలు, ఈ సినిమాకి సపోర్ట్ చేసి థియేటర్లలో మూవీ విడుదలయ్యేలా చేశాయి.
ఓటీటీకి సిద్ధమైన రజాకార్..
అయితే ఈ సినిమా విడుదలయ్యాక కూడా ఓ వర్గం వారు టార్గెట్ చేసినట్లు సమాచారం. అందుకే ఈ సినిమాని ఓటీటీలో విడుదల కాకుండా చేశారు. అయితే ఎట్టకేలకు రజాకార్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసి.. విడుదల తేదీని పోస్టర్తో సహా షేర్ చేశారు. మరి ఇంతకీ రజాకార్ మూవీ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఎప్పుడు విడుదల కాబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. హీరోయిన్ ఇంద్రజ (Indraja), యాంకర్ అనసూయ, బాబీ సింహ, రాజ్ అర్జున్, దేవి ప్రసాద్,వేదిక వంటి ఎంతోమంది నటీనటులు రజాకర్ మూవీలో భాగమయ్యారు. తెలంగాణ చరిత్రకు అద్దం పట్టేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ రజాకార్ మూవీకి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. నారాయణరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ధమాకా,బలగం, మ్యాడ్ చిత్రాలతో పాటూ విడుదలకు సిద్ధంగా ఉన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలకు మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో రజాకార్ మూవీకి సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలకు ముందే చాలామందిని ఆకట్టుకొని భారీ ఎత్తున విడుదలైంది. అయితే సినిమా బాగున్నప్పటికీ కొంతమంది సినిమా పైన నెగటివ్ టాక్ తీసుకువచ్చారు.
జనవరి 24న ఆహా వేదికగా స్ట్రీమింగ్..
అలా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ,మలయాళీ, మరాఠీ భాషల్లో విడుదలైన రజాకార్ మూవీ 2024 మార్చి 15న విడుదలైంది. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాలేదు. కానీ ఎట్టకేలకు దాదాపు విడుదలైన సంవత్సరానికి ఈ సినిమా ఓటీటీ లోకి వస్తుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అయినటువంటి ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రజాకర్ మూవీ ఈనెల అంటే జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ సినిమాను థియేటర్లో మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఓటీటీలో కూడా ఆరు భాషల్లో విడుదలవుతుంది.
Courage, history, and an untold tale! 💪🏽📚🔥 #Razakar Premiering January 24th, only on Aha pic.twitter.com/qoOhsakILt
— ahavideoin (@ahavideoIN) January 7, 2025