Balakrishna :అలుపెరగని నటుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఏడుపదుల వయసులో కూడా ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న బాలయ్య.. దీనికి తోడు పలు బ్రాండ్ ఉత్పత్తులకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ భారీగానే వెనకేసుకుంటున్నారని చెప్పవచ్చు. అంతేకాదు టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh) స్థాపించిన ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ కార్యక్రమానికి హోస్టుగా కూడా వ్యవహరిస్తూ సక్సెస్ చవిచూస్తున్నారు బాలకృష్ణ. ఇకపోతే గత మూడు , నాలుగు సంవత్సరాలుగా బాలయ్య ఏది పడితే అది బంగారం అన్నట్టుగానే మారిపోయింది. ఆయన చేస్తున్న సినిమా లేదా రాజకీయాలు ఇలా ఏ రంగమైనా సరే ఆయన అడుగు పెట్టాడో అక్కడ సక్సెస్ మాత్రమే కనిపిస్తోంది.
బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య.. ప్రోమో వైరల్..
దీనికి తోడు ఇటీవల ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఇక ఈయన సినీ ఇండస్ట్రీకి చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మరొకవైపు వరస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారిన బాలయ్య.. ఇప్పుడు తాజాగా మరో బ్రాండ్ ప్రమోటర్ గానే కాదు అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ బ్రాండ్ కి సంబంధించిన ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేయగా.. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఉత్పత్తులు ఏంటి? అనే విషయానికి వస్తే.. బాలయ్య తాజాగా మ్యాన్షన్ హౌస్ అనే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ (బ్రాందీ) బ్రాండ్ కి బాలకృష్ణ ఇక నుంచి అఫిషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అందుకు సంబంధించిన బ్రాండ్ ప్రమోషన్ వీడియో ప్రోమోని కూడా విడుదల చేశారు. ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించారు. మొత్తానికైతే ఈ బ్రాందీ యాడ్ లో బాలయ్య “దిల్ ఓపెన్ చెయ్ కిక్కే కిక్కు” అంటూ మత్తులో కనిపించారు. అంతేకాదు త్వరలోనే ఫుల్ వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు.
also read:Puri Jagannath : బెగ్గర్ మూవీలో డర్టీ హీరోయిన్… ఊహించడానికి బానే ఉన్నా… అది నిజం కాదు
బాలయ్య సినిమాలు..
ప్రస్తుతం బాలయ్య ఏడాది సంక్రాంతి సందర్భంగా ‘డాకు మహారాజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత తనకు ‘వీరసింహారెడ్డి’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichandh malineni) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు బాలయ్య. మరొకవైపు రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఈయన.. అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran)తో సినిమా తీసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఏదేమైనా బాలయ్య ఇలా ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలలో చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నారు అని చెప్పవచ్చు.
#NBK Officially Signs On as Brand Ambassador for '#MansionHouse.' #Balakrishna #NBK #Trending #BigtvCinema@manabalayya pic.twitter.com/P3nz2ujXLe
— BIG TV Cinema (@BigtvCinema) May 15, 2025