Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రద్ద శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మంచి హైప్ ను క్రియేట్ చేసాయి. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ .. ” ఈ ఫంక్షన్ మొన్న అనంతపురం లో జరుపుకోవాల్సింది. కానీ మొన్న తిరుమలలో ఆ ఘటన జరగడంతో అప్పుడు ఆపేశాం. ఇప్పుడు ఇక్కడ ఈ వేడుకను జరుపుకుంటున్నాం. తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటన జరగకుండా ఉండాల్సింది. మృతి చెడినవారందరి ఆత్మలు శాంతించాలని , వారి కుటుంబ సభ్యులకు మా తరుపున , మా సినిమా తరుపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
ఈ వేడుక అనంతపురంలో చేయాల్సి ఉంది. ఈ వేడుక కోసం నా అభిమానులు ఎన్నో ఊర్ల నుంచి తరలివచ్చారు. చివరకు క్యాన్సిల్ అవ్వడంతో ఎంతో అసహనానికి గురయ్యారు. వారందరిని శాంతపరిచి ఇంటికి పంపిన నా క కన్వీనర్లకు థాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు క్రమశిక్షణ కలిగిన అభిమానులు నా సైనికులు. ఎంతోమంది పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకరిద్దరుని కలుస్తాం. కానీ, ఇన్ని లక్షల, వేల కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
Sookshmadarshini OTT : ఓటీటీలోకి మరో మిస్టరీ థ్రిల్లర్.. డిస్నీ+ హాట్‌స్టార్ లో నజ్రియా మూవీ
నేను ఈ జీవితంలో ఇంత పొందాను అంటే ముందుగా నేను చెప్పాల్సింది.. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను ఆయన ప్రతిరూపంగా మీ హృదయాల్లో నిలిపిన దైవాంశ సంభూతులు, నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణజన్ముడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అమ్మ, నాన్నలు.. ఇలాంటి జన్మ నాకిచ్చినందుకు, ఇలాంటి అభిమానులను నాకిచ్చినందుకు దేవుడికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇక సినిమా గురించి చెప్పాలంటే డాకు మహారాజ్. నాన్నగారిలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. ప్రపంచంలో ఎవరు చేయని పాత్రలను ఆయన చేశారు. జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు.. ఫస్ట్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369, భైరవ ద్వీపం ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. వీటితో పాటు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు విడుదల అవుతున్న డాకు మహారాజ్ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది.
డాకు మహారాజ్ సినిమా డిస్కషన్స్ లో డైరెక్టర్ చెప్పిన దానికి నేనుకనెక్ట్ కాలేకపోయాను. ఏదో కథలా అనిపించింది. నేనెప్పుడూ ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగానే చేయాలనుకుంటాను. ఈ సినిమాలో కూడా ఆదిత్య 369 లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకులను ఎలా మెప్పించిందో.. అలాంటి పాత్ర పెట్టాలని అనుకున్నాం. నా సినిమాలో ఒక్కో సమస్యను చూపిస్తాను. ఏదో ఒక సందేశం ఇవ్వాలనుకుంటాను. ఇక ఇందులో తెలుగువాళ్ల గొప్పతనం ఏంటి అనేది చెప్పడం జరిగింది.
గేమ్ ఛేంజర్ కన్నా ముందు టాలీవుడ్ లో వచ్చిన టాప్ 10 పొలిటికల్ మూవీస్ ఇవే ..
డాకు మహారాజ్ ఎలా ఉంటుంది అనేది ట్రైలర్ లో చూసారు. అసలుసిసలైన ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక నాతో పాటు చేసిన నటీనటులందరూ బాగా చేశారు. అందరి పాత్రలు చాలా బావున్నాయి. అన్ని ప్రాధాన్యత ఉన్న పాత్రలే. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన పాత్రలు పోషించారు. ఊర్వశీ కేవలం సాంగ్ కు మాత్రమే కాదు.. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది. కెమెరామెన్ విజయ్ కన్నన్ తన అద్భుతమైన వర్క్ చూపించాడు. థమన్, నా కాంబినేషన్ ఎంత హిట్టొ చెప్పనవసరం లేదు.
యానిమల్ సినిమా తర్వాత అయన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనిబాబీ డియోల్ ని తీసుకున్నాం. ఆయన పాత్ర గురించి మేము ఎన్నో అనుకున్నాం. చివరికి మంచిగా వచ్చింది. మూడు వరుస ఘన విజయాల తరువాత వస్తున్నాను. ఇంతకు ముందు ఎన్నో ఇచ్చాను. అఖండ తరువాత నా రెండో ఇన్నింగ్స్ అని అన్నారు. సాధారణంగా రెండో ఇన్నింగ్స్ అంటే స్టార్ డమ్ తగ్గినప్పుడో, నాకదికాదు చూపిస్తా ముందు ముందు.
అఖండ తరువాత నా ప్రస్థానం ఏంటో ఈ సినిమా రంగానికి చూపిస్తాను. ఏం చూసుకొని ఇంత అహంకారం అని అనుకుంటారు. నన్ను చూసే.. నా పదునైన పొగరు. చాలా సంతోషం ఆలా అంటే. ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు. ఒక సినిమా పూర్తిచేసుకొని.. అది రిలీజ్ అయ్యి ఎలా ఉంటుందా అని నిద్రాహారాలు మాని ఉన్నప్పుడు.. వాటిని విజయవంతం చేసి.. వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మమల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షక దేవుళ్ళకు నేనెంతో రుణపడి ఉన్నాను. సంక్రాంతికి విడుదలైన నా సినిమాలన్నీ విజయం సాధించాయి. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న డాకు మహారాజ్ కూడా ఘన విజయం సాధిస్తుంది. మీరు ఊహించిన దానికంటే మించే ఈ సినిమా ఉంటుంది. అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు” అని ముగించారు.