HBD Balayya : నందమూరి నట సింహం బాలయ్య సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. నందమూరి తారక రామారావు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలో మాస్ ఆఫ్ గాడ్ గా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసుకున్నారు. నటసింహ బాలయ్య బాబు.. ఈ పేరు వింటేనే అభిమానులు ఆనందంతో కేరింతలు కొడతారు. ‘జై బాలయ్యా..’ అంటూ ఊగిపోతారు. బాలయ్య చెప్పే వీరోచిత డైలాగ్స్‌కి పులకించిపోతారు. తెరపై బాలకృష్ణ కనిపిస్తే చాలు అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. పవర్‌ఫుల్ డైలాగులు చెప్పాలన్నా, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాలన్నా అది బాలయ్యకే సాధ్యం అని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం.. నేడు లెజండరీ హీరో బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ఆయన సినీ ప్రస్థానం గురించి మరోసారి గుర్తు చేసుకుందాం..
బాలయ్య బాల్యం, విద్యాభ్యాసం…
బాలయ్య 1960 జూన్ 10 న జన్మించారు. ఆయన బాల్యం, హైదరాబాదులో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నాడు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు. 1974 లో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. ఆ తర్వాత కొన్నేళ్లు సినిమాల్లో రాణించారు. ఇక 1982లో వసుంధరాదేవి వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, ఒక కుమారుడు మోక్షజ్ఞ ఉన్నాడు.
తండ్రికి తగ్గ తనయుడు..
బాలయ్య తన పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన ‘తాతమ్మకల’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కథానాయకుడు కాకముందు ఆయన నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్టిఆర్ దర్శకత్వం వహించారు. 2021 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ వారి కలయికలో మూడవ సినిమా ఎన్టీ రామారావు గారి 12 మంది సంతానంలో ఈయన ఆరవ కుమారుడు చిన్నతనంలోనే సినిమాలలోకి ప్రవేశించిన బాలయ్య ఇప్పటికీ వంద కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు. ఆయన ఇప్పటివరకు నటించిన సినిమాల్లో కొన్ని పరాజయం అందుకున్నా కూడా మళ్లీ అభిమానులను నిరాశ పరచకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
Also Read :మేకర్స్ డైలమా.. ఫ్యాన్స్ కన్ఫ్యూజన్..!
పద్మభూషణ్ అవార్డు..
బాలయ్య సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ అవార్డును 2025 జనవరి 25న ప్రకటించింది. ఆయన ఏప్రిల్ 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.
ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికొస్తే.. పోయిపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 చేస్తున్నాడు. దీని తర్వాత గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు.. ఆ తర్వాత మార్కో డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు.. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు..