BigTV English

Dasara: దసరా మూవీ రివ్యూ.. నాని ఖాతాలో మరో హిట్..

Dasara: దసరా మూవీ రివ్యూ.. నాని ఖాతాలో మరో హిట్..

Dasara: చిత్రం: దసరా
నటీనటులు: నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, ఝాన్సి, పూర్ణ, జరీనా వాహాబ్ తదితరులు
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీమాస్
విడుదల: 30-03-2023


న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ దసరా. ట్రైలర్, టీజర్‌, సాంగ్స్‌తో భారీగా హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. నాని మొదటి సారి డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో.. భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినీప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా.. అని ఎదురు చూశారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దసరా. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయింది.

స్టోరీ:
సినిమా తెలంగాణలోని వీర్లపల్లి అనే ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఆగ్రామంలోని జనాల జీవితం.. బొగ్గు మైనింగ్ చుట్టూ తిరుగుతుంది. ఇకపోతే వీర్లపల్లికి చెందిన ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్), మరియు సూరి (దీక్షిత్ శెట్టి)లు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచే ధరణికి వెన్నెల అంటే ఎంతో ఇష్టం. కానీ వెన్నెల.. ధరణిని పట్టించుకోకుండా సూరి గురించి ఆలోచిస్తుంటుంది. అదే సమయంలో లోకల్ రాజకీయాల వల్ల ధరణి జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ ఏర్పడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? దానివల్ల ధరణి జీవితం ఎలా మారింది? తెలిమాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే…


నటీనటులు:
సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు నాని తన పాత్రలో మునిగిపోయాడు. 100 శాతం తన పాత్రకు న్యాయం చేశాడు. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. దీక్షిత్ శెట్టి, మలయాళ నటుడు షైన్ టామ్ చాకోలు తమ పాత్రకు న్యాయం చేశారు. సినిమాలో సముద్రఖని తక్కవ సమయమే కనిపించినప్పటికీ అద్భుతంగా నటించాడు. చాలా రోజుల తర్వాత సాయికుమార్ ఈ మూవీలో అదరగొట్టాడు.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమాతోనే రచ్చ చేశాడు. ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్‌లా సినిమాను తెరకెక్కించాడు. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సంతోష్ నారాయణ్ తన సాంగ్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు.

బలాలు:

సినిమాటోగ్రఫీ
నాని, కీర్తిసురేష్
ఎమోషనల్ సీన్స్
ఇంటర్వెల్

బలహీనతలు:

స్లో సన్నివేశాలు
ప్రెడిక్టబుల్ స్టోరీ

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×