BigTV English
Advertisement

Hit 3 Business: దూసుకుపోతున్న నాని.. ఈ రేంజ్ లో బిజినెస్ ఏంటి సామీ..!

Hit 3 Business: దూసుకుపోతున్న నాని.. ఈ రేంజ్ లో బిజినెస్ ఏంటి సామీ..!

Hit 3 Business:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదామనుకొని నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నాని.. ఒకప్పుడు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పుడు తనకంటూ ఒక స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి (Chiranjeevi ) తర్వాత ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న హీరోలలో నాని (Nani ) కూడా ఒకరు అని చెప్పాలి. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సాలిడ్ సబ్జెక్టుతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. చివరిగా వివేక్ ఆత్రేయ (Vivek Aatreya) దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈయన.. ఆ తర్వాత వరుసగా ప్రాజెక్టులు ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు.


విడుదలకు ముందే రికార్డు..

ప్రస్తుతం నాని డైరెక్టర్ శైలేష్ కొలను(Shailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్టుకు అటు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకోగా.. అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పటికే హిట్ :2 కి కేవలం రూ.15 కోట్లు బడ్జెట్ పెట్టగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.42.5 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు నాని హిట్ 3: ది థర్డ్ కేసులో నటిస్తూ ఉండడంతో.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమా కోసం మేకర్స్ రూ.60కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ హక్కులు కూడా సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.


ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ఏరియా వైజ్ గా బిజినెస్ బాగానే జరిగింది.

ఆంధ్ర – రూ.15 కోట్లు

సీడెడ్ – రూ.5.40 కోట్లు

నైజాం – రూ.13 కోట్లు

కర్ణాటక – రూ.3 కోట్లు

ఓవర్ సీస్ (యుఎస్ తో కలిపి) – రూ.6 కోట్లు

మొత్తం నాన్ రికవరబుల్ అడ్వాన్స్ కావడం గమనార్హం. నాని పైన ఉన్న నమ్మకంతోనే ఈ రేంజ్ లో సినిమా హక్కులు అమ్ముడుపోయాయి. ఏది ఏమైనా నాని రేంజ్ మామూలుగా లేదని అటు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక అటు ఈ సినిమాకి రూ.60 కోట్లు బడ్జెట్ కేటాయించగాఇప్పుడు బిజినెస్ పరంగా రూ.42.40 కోట్ల కోట్ల మేర రాబట్టింది. అటు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కూడా ఈ సినిమా సాటిలైట్ హక్కులను సుమారుగా రూ.54 కోట్లకు కొనుగోలు చేశారు. మొత్తానికైతే విడుదలకు ముందే భారీగా రాబడుతున్న నాని.. ఈ సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తారో చూడాలి. ఇక నాని ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు నిర్మాతగా కూడా చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×