BigTV English

Odela 2: ఓదెల 2 టీమ్ కి షాక్.. ఆ సన్నివేశాలపై బీసీ కమిషన్ సీరియస్

Odela 2: ఓదెల 2 టీమ్ కి షాక్.. ఆ సన్నివేశాలపై బీసీ కమిషన్ సీరియస్

Odela 2: ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్ గా ‘ఓదెల 2’ ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రేతాత్మలు కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అటు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీ కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో తమన్నా (Tamannaah) శివశక్తిగా తొలిసారి నాగ సాధ్వి గా కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాపై బీసీ కమిషన్ సీరియస్ అయింది. ముఖ్యంగా అందులోని కొన్ని పదాలను తీసివేయాలని కూడా కామెంట్ చేసింది. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.


కులాన్ని దూషించే పదాలు వాడినట్టు బీసీ కమిషన్ కి ఫిర్యాదు..

అసలు విషయంలోకి వెళ్తే.. ఓదెల 2 సినిమాకి భారీ షాక్ తగిలింది. ఈ చిత్రంలో కులం పేరుతో ఉన్న అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ కమిషనర్ కు బిసి కమిషన్ ఫిర్యాదు చేసింది. అలాగే ఆయా సన్నివేశాలను తొలగించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కమిషన్ కూడా సూచించింది. ఇక ఈనెల విడుదలైన ఓదెలా 2 సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ 116 రూపాయలు కానుక రాయించిన విషయంపై జరిగిన వాద ప్రతివాదములు పిచ్చగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడినట్టు తమ దృష్టికి వచ్చింది అని బీసీ కమిషన్ తెలిపింది. ఈ విషయంపై శుక్రవారం పిచ్చగుండ్ల కులానికి చెందిన పి.మల్లేష్ అనే వ్యక్తి బీసీ కమిషన్ కి ఫిర్యాదు చేశారని, తెలిపిన కమిషన్ ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను కూడా తొలగించాలని కోరినట్లు స్పష్టం చేసింది.


వెంటనే తొలగించాలని డిమాండ్..

ఇకపోతే ఇదివరకే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. ఇంతవరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, అందుకే ఈ విషయమై కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఒక లేఖ రాస్తూ దర్యాప్తు చేసిన వెంటనే. ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయిత ఈ అభ్యంతరకర పదాలు వాడిన నటులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరింది. ఇక ఫిలిం సెన్సార్ బోర్డు ఈ అభ్యంతర పదాలు ఉన్నటువంటి చిత్రాన్ని ఆ పదాలు తొలగించకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని కూడా కమిషన్ తప్పు పట్టింది. దీనికి తోడు ఈ సినిమా థియేటర్లలో నడుస్తున్న నేపథ్యంలో ఇకపై జరిగే చిత్ర ప్రదర్శనలో ఈ అభ్యంతరకర పదాలను తక్షణమే తొలగించాలని కూడా డిమాండ్ చేసింది. ముఖ్యంగా తెలంగాణ డిజిపి కి కూడా ఈ ఉత్తరం కాపీని పంపిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలుపగా… దీనిపై స్పందించిన సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి రాహుల్ గౌలీకర్ ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు తమన్నా మూవీకి కొత్త చిక్కులు వచ్చాయని చెప్పవచ్చు. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ALSO READ:Hit 3 Business: దూసుకుపోతున్న నాని.. ఈ రేంజ్ లో బిజినెస్ ఏంటి సామీ..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×