BigTV English

Nani New Movie : స్టార్ హీరో సినిమాలో వేలు పెట్టిన మేనేజర్… పారితోషికం కోసం ప్రొడ్యూసర్ ను మార్చారా?

Nani New Movie : స్టార్ హీరో సినిమాలో వేలు పెట్టిన మేనేజర్…  పారితోషికం కోసం ప్రొడ్యూసర్ ను మార్చారా?

Nani New Movie : కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాలను రెన్యూనరేషన్ లు శాసిస్తాయి అనేది నిజం అనిపించే సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో నెలకొంటాయి. తాజాగా ఏకంగా ఓ స్టార్ హీరో మేనేజర్ ఏకంగా ప్రొడ్యూసర్ ను మార్చి పారేసాడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు? ఏ హీరో విషయంలో ఇదంతా జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళితే…


నేచురల్ స్టార్ నాని (Nani) గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. రీసెంట్ గా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు ‘హిట్ 3’ (Hit 3) సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ‘సరిపోదా శనివారం’ సినిమా తీస్తున్నప్పుడే నాని మరోసారి నిర్మాత దానయ్యతో కలిసి ఇంకో సినిమాను చేయాలనుకున్నారు. దానికి డైరెక్టర్ సుజిత్ (Sujeeth). ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల ఇంకా ఆలోచన దశలోనే ఆగిపోగా, ఇప్పుడు ఏకంగా నిర్మాతను మార్చేసి ముందుకు తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. అయితే అలా నాని – సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు ముందుగా దానయ్యను అనుకుని, తర్వాత మరో నిర్మాత దగ్గరికి వెళ్లడానికి కారణం నాని మేనేజర్ అనే టాక్ నడుస్తోంది.

ఇలా నాని టీంతో పాటు డైరెక్టర్ కూడా ఏకంగా నిర్మాతను మార్చడానికి కారణం ‘సరిపోదా శనివారం’ సినిమా రెమ్యూనరేషన్ వివాదమని తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మాత దానయ్య (Danayya) నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్లో నిర్మించారు. ఏకంగా మూవీ కోసం 40 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే సినిమా రిజల్ట్స్ సంగతిని పక్కన పెడితే ఈ మూవీకి నాని మొత్తం 22 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. కానీ అందులోనూ నిర్మాత దానయ్య 5 కోట్లు ఆలస్యంగా ఇచ్చారనే కారణంతో కోపంగా ఉన్నారట నాని టీం. దీంతో నాని మేనేజర్ ఏకంగా ఈ ప్రాజెక్టును నిర్మాత దానయ్య చేతిలో నుంచి తీసి మరో ప్రొడ్యూసర్ చేతిలో పెట్టారట.


అంతేకాకుండా సుజిత్ మూవీ కోసం నాని (Nani) ఏకంగా 40 కోట్లు రెమ్యునరేషన్ గా డిమాండ్ చేశారని, దీంతో దానయ్య వెనకడుగు వేశాడని ఆల్రెడీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక ఇప్పుడు మాఫియా బ్యాగ్రౌండ్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సినిమాను నాని నిర్మాత వెంకట్ బోయనపల్లికి అప్ప చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో ఈ ప్రొడ్యూసర్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను నిర్మించారు. అయితే నిజానికి నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను సితార బ్యానర్ లో చేయాల్సి ఉంది. కానీ అప్పట్లో సితార బ్యానర్ ఈ ప్రాజెక్టు వర్కౌట్ కాదనే ఆలోచనతో పక్కన పెట్టగా, వెంకట్ బోయనపల్లి చేతిలో పడింది.

ఇప్పుడు మరోసారి అలాగే సుజిత్ – నాని (Sujeeth-Nani) ప్రాజెక్ట్ దానయ్య చేతులు మారి వెంకట్ బోయనపల్లి దగ్గరకు చేరింది అని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే సుజిత్, నాని దానయ్యకు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ ను ఫుల్ ఫిల్ చేయడానికి ఇద్దరూ వేరువేరుగా సినిమాలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఒక మేనేజర్ హీరో రెమ్యూనరేషన్ ను ఆలస్యంగా ఇచ్చారనే కారణంతో ఏకంగా డైరెక్టర్ తో కలిసి నిర్మాతను మార్చడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×