BigTV English

Hoax Caller Arrested : విమానాలకు బాంబు బెదిరింపులు.. దర్యాప్తు సంస్థల చేతికి చిక్కిన కీలక వ్యక్తి

Hoax Caller Arrested : విమానాలకు బాంబు బెదిరింపులు.. దర్యాప్తు సంస్థల చేతికి చిక్కిన కీలక వ్యక్తి

Hoax Caller Arrested : భారత్ లో ఇటీవల కాలంలో విమానాలకు వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే విమాన సర్వీసుల్లో చిన్నపాటి అజాగ్రత్తలకు కూడా అవకాశం ఇవ్వరు. ఈ కారణంగానే… బెదిరింపు కాల్స్ వచ్చిన ప్రతీసారి… దేశ భద్రతా ఏజెన్సీలకు అదనపు పని పడుతోంది. దాంతో… బెదిరింపు కాల్స్ ఘటనలపై సీరియస్ గా దృష్టి పెట్టిన పోలీసులు, భద్రతా సంస్థలు… తాజాగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల జగదీష్ ఉయికే అనే వ్యక్తి.. కొంత కాలంగా విమానయాన సంస్థలు, హోటళ్లు, బ్యాంకులకు బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు… ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.


జగదీష్ ఉయికే ఇప్పటికే అనేకసార్లు వివిధ సంస్థలకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపించినట్లు గుర్తించామని.. ముంబయి నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా ఖేద్కర్ తెలిపారు. వాటిని ట్రేస్ చేస్తూ వస్తున్న పోలీసులు తాజాగా.. మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇతను గతంలో ఓ కేసులో అరెస్టు అయ్యాడని తెలిపిన పోలీసులు.. ఇతను ఉగ్రవాదానికి సంబంధించిన రచనలు సైతం చేసినట్లు గుర్తించారు. ఇతన రచనలు దేశంపై ద్వేషం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇతని గురించి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. విమానయాన సంస్థలతో పాటు రైల్వేల బాంబు బెదిరింపులు వస్తుండడంతో… కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల దగ్గర పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు.

జగదీష్ అరెస్టుకు రెండు రోజుల ముందు దిల్లీలో ఓ అనుమానితుడు పోలీసులకు చిక్కాడు. రాజ్ పూరికి చెందిన శుభమ్ ఉపాధ్యాయ
అనే 25 ఏళ్ల యువకుడు కూడా వివిధ సంస్థలు, కార్యాలయాలకు నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు గుర్తించి దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కూడా తను బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 16న చత్తీష్ గఢ్ లో ఓ 16 ఏళ్ల యువకుడు సైతం ఇదే తరహా ఘటనలకు పాల్పడుతుండగా.. పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అయితే… ఇతను పాఠశాల స్థాయిలోనే చదువు మానేసి… ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ కుర్రాడు ఇటీవల కాలంలో నాలుగు విమానలకు బాంబు బెదిరింపు సందేశాలు పంపించగా… అందులో రెండు విమానాలు ఆలస్యంగా నడవగా, ఒక సర్వీసు పూర్తిగా రద్దయ్యింది.


ఈ ఘటనలపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే స్పందించారు. పౌర సేవలకు, విమాన సర్వీసులకు అంతరాయం కలిగించే ఎలాంటి బెదిరింపు ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోందని, వారిని జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిగా భావించి కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే… జాతీయ భద్రతా సంస్థలు మరింత లోతుగా ఈ ఘటనలపై అధ్యయనం చేస్తోంది.

దేశంలో పెరిగిపోతున్న బాంబు బెదిరింపు ఘటనలపై విచారణకు వివిధ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపిన.. జాతీయ భద్రతా సంస్థ – ఎన్ఐఏ (NIA) ఇంటెన్సిఫైడ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌లో భాగంగా.. ప్రధాన విమానాశ్రయాల్లో బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (BTAC) బృందాల్ని మోహరించినట్లు వెల్లడించింది.

Also read :విమానాల ఉత్పత్తి మొదలు.. టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

 

అయితే.. ఇప్పటి వరకు వచ్చిన కాల్స్ లో దాదాపు అన్నీ నకిలిగా తేల్చిన అధికారులు… వీటిని పంపిన నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని, ఇందుకోసం సైబర్ సెక్యూరిటీ అధికారుల సహాయం తీసుకుంటున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే.. మెసేజ్ లు పంపుతున్న వారు దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా, వారి సాంకేతిక ఆధారాలు తప్పుగా చూపించే వీపీఎన్ (VPN) వాడుతున్నట్లు గుర్తించారు. దర్యాప్తు ప్రారంభంలో.. బెదిరింపు మెయిల్స్ లో చాలా వరకు యూరోప్ దేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. కానీ.. చివరికి అవ్వన్నీ వీబీఎన్ (VPN) వినియోగించడం వల్ల అలా వచ్చినట్లు గుర్తించారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×