Kuppam Municipal Chairman: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. వైసీపీ నుంచి నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీకి 15 మంది సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా సెల్వరాజు ఎన్నికయ్యారు. కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ కుర్చీ గెలుచుకోవడానికి అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా నిలబడ్డాయి. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన డాక్టర్ సుధీర్ తన మున్సిపల్ చైర్మన్ పదవితోపాటు 16వ వార్డునుంచి గెలుచుకున్న కౌన్సిలర్ పదవికి కూడా గతేడాది నవంబరు 6న రాజీనామా చేశారు. అప్పటినుంచి మున్సిపల్ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. మున్సిపాలిటీలో 25 వార్డులుండగా, 16వ వార్డు ఖాళీ కావడంతో 24 మంది కౌన్సిలర్లే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
టీడీపీ తరఫున గెలిచినవారు ఆరుగురు, తర్వాత పార్టీలో చేరిన నలుగురితో కలిపి.. ఇప్పుడా పార్టీకి 10 మంది కౌన్సిలర్ల బలం ఉంది. మరోవైపు వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ 24 మంది కౌన్సిలర్లకు కాకుండా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంది. ఈ ప్రకారం తీసుకుంటే సభ్యుల సంఖ్య మొత్తం 27గా ఉంది.
అటు గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రకి 34 ఓట్లు లభించగా.. వైసీపీ అభ్యర్థి వెంకట రెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో కూటమినే గెలుపు వరించింది. కార్పొరేటర్లతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే లు రామాంజనేయలు, నసీర్, గల్లా మాదవి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
Also Read: ఒక్కో కత్తి పోటుకు రూ. 2 లక్షలు.. వీరయ్య హత్య కేసులో సంచలన నిజాలు
మరోవైపు పల్నాడు మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లోనూ కూటమి తన ఖాతోలో వేసుకుంది. మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. ఇందులో 21 మంది కౌన్సిలర్ల మద్దతుతో.. టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుతుంది. టీడీపీ బలపరిచిన అభ్యర్ధి 27 వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ ఛైర్మన్ పీఠం అధిష్టించబోతోంది. గతంలో మాచర్లలో ఏకపక్షంగా ఛైర్మన్ పీఠం దక్కించుకున్న వైసీపీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారనుంది.
ఇదిలా ఉంటే.. మరోవైపు గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు.. జీవీఎంసీ పరిధిలోని 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫిషీయో సభ్యుల హోదాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. జీవీఎంసీ మేయర్‌గా 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పేరు ఖరారయింది. టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ శ్రీనివాసరావుకు బీఫాం అందజేశారు.