Nani: ఈరోజుల్లో ప్రతీ సినిమాలో ఒకేలాగా ఉంటే ప్రేక్షకులు ఆదరించరేమో అని, ఎప్పటికప్పుడు తమ స్క్రిప్ట్ సెలక్షన్‌ను, దానికి తగినట్టుగా తమ రూపురేఖలను మార్చాలని నటీనటులు అనుకుంటూ ఉంటారు. కానీ అలా లేకపోయినా కేవలం తమ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసినవాళ్లు కూడా ఉన్నారు. అందులో నేచురల్ స్టార్ నాని ముందుంటాడు. కేవలం స్క్రిప్ట్ సెలక్షన్‌తో, తన నేచురల్ యాక్టింగ్‌తోనే ఆడియన్స్‌ను మెప్పిస్తూ వచ్చాడు నాని. కానీ మొదటిసారి తనను తాను పూర్తిగా మార్చుకొని ‘ది ప్యారడైజ్’తో ఫ్యాన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాడు. అసలు ఇంత బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం తాను ఎలా ఒప్పుకున్నాడో తాజాగా బయటపెట్టాడు నాని.
అందుకే ఒప్పుకున్నా
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ఇప్పటికే ‘దసరా’ అనే సినిమాను చేశాడు. అసలు శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిందే నాని. అప్పటివరకు మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌లో కనిపించి ‘దసరా’ హిట్ అయ్యేలా చేశాడు. అలాంటి శ్రీకాంత్ ఓదెలతోనే నాని మరొక సినిమా చేస్తున్నాడు అంటే అప్పుడే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. కానీ ఎవరూ ఊహించని రేంజ్‌లో ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌ను వదిలారు మేకర్స్. అందులో నాని బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, రెండు జడలు, బూతులు.. ఇవన్నీ చూస్తే ఇది అసలు నాని సినిమానేనా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజ్‌లో వైలెంట్ సినిమాను తాను ఎందుకు ఒప్పుకున్నాడో చెప్పుకొచ్చాడు ఈ హీరో.
చేయాల్సిందే అన్నాడు
‘‘పాత్రకు తగినట్టుగా బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది నేను ఎప్పుడూ నమ్మను. కానీ శ్రీకాంత్ ఓదెల నన్ను ఒప్పించాడు. తనను నమ్మి నేను బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చేయడానికి సిద్ధపడ్డాను. అది క్రాక్ చేయాల్సిన ఎనర్జీలాగా మారిపోయింది. శ్రీకాంత్ ఓదెల బాగా ఆలోచించేవాడు, తన ఒరిజినల్ విజన్ కోసం ఏదైనా చేయడానికి నిర్ణయించుకుంటాడు. దానికోసమే కష్టపడతాడు. ఇలా వర్కవుట్ చేయడం అనేది అసలు నా కెరీర్‌లో భాగమని నేను అనుకోలేదు. చాలామంది బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అంతా ఎప్పుడు చేస్తావని అడుగుతూ ఉండేవారు. ఎందుకు అదేమైనా స్క్రీన్ మీద ముఖ్యమా అని అడిగేవాడిని. కానీ ఓదెల మాత్రం నువ్వు చేయాల్సిందే అన్నాడు’’ అని గుర్తుచేసుకున్నాడు నాని (Nani).
Also Read: తారక్ తీరని కోరిక.. చచ్చిపోయి.. మళ్లీ పుట్టి తీర్చుకుంటాడట
స్పెషల్ టీమ్
‘ది ప్యారడైజ్’ (The Paradise)లో బాడీని ఆ రేంజ్‌లో ట్రాన్స్‌ఫార్మ్ చేయడం కోసం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)నే స్వయంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేశాడని బయటపెట్టాడు నాని. వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీ విడుదలకు సిద్ధమయ్యింది. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ స్క్రిప్ట్స్‌తో వచ్చి హిట్ కొట్టిన నాని.. ఇప్పుడు తన కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ రిస్కులు చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ సినిమా చేశాడు నాని. అందులో మొదటిసారి ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ మేలో రిలీజ్ అవుతుండగా.. దీని రిలీజ్ తర్వాత ‘ది ప్యారడైజ్’పై ఫోకస్ చేయనున్నాడు నాని.