BigTV English

Rajamouli: అప్పుడు రగిలిపోయేంత కోపం వస్తుంది.. ‘హిట్ 3’ ఈవెంట్‌లో రాజమౌళి కామెంట్స్

Rajamouli: అప్పుడు రగిలిపోయేంత కోపం వస్తుంది.. ‘హిట్ 3’ ఈవెంట్‌లో రాజమౌళి కామెంట్స్

Rajamouli: త్వరలో విడుదల కానున్న సినిమాల్లో ఎక్కువగా ప్రేక్షకుల ఫోకస్ అంతా ‘హిట్ 3’పైనే ఉంది. నేచురల్ స్టార్ నాని మొదటిసారి అర్జున్ సర్కార్ అనే వైలెంట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. నానిని ఇలాంటి క్యారెక్టర్‌లో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయగలరా అని అనుమానాలు వ్యక్తమయినా కూడా ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఈ మూవీ గురించే హాట్ టాపిక్‌గా మారడం చూస్తుంటే ‘హిట్ 3’ పక్కా హిట్ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక ధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అందులో నానిపై, దర్శకుడు శైలేష్ కొలనుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ‘హిట్ 3’ హిట్ అవ్వాలని కోరుకున్నారు.


లోపల రగిలిపోతుంది

‘‘నాని చాలా బాగా మాట్లాడి అందరినీ ఎమోషనల్ చేసేశారు. ఇండస్ట్రీలో ప్రశాంతిని మేము హిట్ మెషీన్ అని పిలుచుకుంటాం. అంత ట్రాక్ రికార్డ్ ఎవ్వరికీ లేదనుకుంటా. వరుసగా తను నిర్మించిన సినిమాలు అన్నీ సక్సెస్. తను తెరకెక్కిస్తున్న అయిదో సినిమా హిట్ 3 కూడా అదే తోవలోకి వెళ్తుందని నా గట్టి నమ్మకం. మొన్న మామూలుగా హిట్ 3 సినిమా ఇంటర్వ్యూలు చూస్తున్నాను. మా సినిమా వాళ్లకు.. అంటే ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, హీరోలకు ఏదైనా లీక్ అయితే చాలా బాధగా ఉంటుంది. లోపల రగిలిపోతుంటుంది. అలాంటిది జరల్నిస్టులు అడిగిన మాటలకు చాలా కోపం రావాల్సింది పోయి శైలేష్ చాలా కూల్‌గా మాట్లాడాడు. అది నన్ను బాగా ఆకట్టుకుంది’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి.


మరెన్నో చేయాలి

‘హిట్ 3’ (Hit 3) సినిమాకు సంబంధించిన విషయం లీక్ అయినా కూడా శైలేష్ కొలను చాలా బాగా హ్యాండిల్ చేశాడని, తన మీద గౌరవం పెరిగిందని అన్నారు రాజమౌళి. ‘‘చాలామంది చాలా ఫ్రాంచైజ్‌లు క్రియేట్ చేస్తారు. మన దగ్గర అలాంటివి తక్కువ. ఆ ఫ్రాంచైజ్‌లు ఎంత దూరం వెళ్తాయో ఎవరూ గ్యారెంటీగా చెప్పలేరు. హిట్ ఫస్ట్ కేస్ అని క్రియేట్ చేయగానే ఎన్నో కేసులు ఉంటాయి కదా అనే ఆలోచన వచ్చేస్తుంది. పోలీస్ కేసుల అనేవి ఎన్నో ఉంటాయి. శైలేష్‌కు ఉన్న ఐడియాలు ఏడే అయినా ఈ ఐడియాతో ఎన్ని అయినా చేయొచ్చు’’ అంటూ శైలేష్ కొలను (Sailesh Kolanu)ను హిట్ యూనివర్స్‌లో మరెన్నో సినిమాలు చేయడానికి మోటివేషన్ ఇచ్చారు రాజమౌళి (Rajamouli).

Also Read: సక్సెస్ ఫార్ములా పట్టుకున్న శ్రీనిధి.. ఆ డైరెక్టర్ వస్తే హిట్ 3 హిట్ అయినట్టే..

ముందుకు వెళ్లాలి

‘‘నాని (Nani) నుండి చాలా ఆశిస్తాం. తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంది. తన దగ్గర నుండి మరెన్నో కావాలి అని అనుకుంటూ ఉంటాం. నేను అనుకున్న దానికంటే నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు. ఆశ తీరదు కాబట్టి తను మరెంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటాను. నువ్వు ఇలాగే ఎదగాలి. హిట్ 3 నుండి వస్తున్న అప్డేట్స్ అన్నీ అది సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయనే వైబ్ క్రియేట్ చేస్తున్నాయి’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. ‘హిట్ 3’ను తప్పకుండా చూడమంటూ ఆప్ కీ బార్ అర్జున్ సర్కార్ అనే డైలాగ్ కూడా చెప్పారు. ఈ స్పీచ్ నాని ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపింది. మే 1న ఈ మూవీ విడుదలకు సిద్ధమయ్యింది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×