HIT3: నాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా వస్తున్న సినిమా హిట్ ది థర్డ్ కేస్.. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపీర్నేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే 1న ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి అయన సతీమణి రమ హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫైట్ మాస్టర్ సతీష్ మాట్లాడుతూ ఆడియన్స్ కి ఓ సప్రైజ్ ను రివీల్ చేశారు. అదేంటో చూసేద్దాం ..
సప్రైజ్ అదే ..
ఫైట్ మాస్టర్ సతీష్ మాట్లాడుతూ.. నాని సార్, ఫ్యాన్స్ కి నమస్కారం శైలేష్ గారికి థాంక్స్ చెప్పాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.. నానితో ఇది నా మూడో సినిమా.. దసరా, సరిపోదా శనివారం, ఆ తర్వాత హిట్ 3. బ్యాక్ టు బ్యాక్ నాని సినిమాలో నేను పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాని సార్ చాలా కష్టపడ్డారు. సార్ కి మధ్యలో హెయిర్కి ఫైర్ అంటుంది. పేస్ పై ఒక ప్లేస్ దగ్గర చిన్న క్రాక్ కూడా అయింది. హాస్పిటల్ కి కూడా వెళ్లకుండా షాట్ చేశారు. చాలా డెడికేటెడ్ పర్సన్ అండ్ మొండోడు కూడా.. ఇందులో ఫైట్స్ గట్టిగా ఉంటాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు. ఓపెనింగ్ ఫైట్ చాలా బాగుంటుంది. అది కాశ్మీర్ లో చేశాను. సూపర్ గా ఉంటుంది. శైలేష్ సార్ చాలా బాగా ప్లాన్ చేసి కాంప్రమైజ్ కాకుండా, పర్ఫెక్ట్ అయ్యే వరకు చాలా బాగా చేయించారు. ఈ సినిమాలో మీకు ఓకే సప్రైజ్ వుంది. అది శ్రీనిధి గారు కూడా ఒక ఫైట్ చేశారు. మూవీలో ఆ ఫైట్ చాలా బాగా వచ్చింది అని తెలిపారు.ఇది తెలుసుకున్న నాని ఫాన్స్ మూవీలో ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారా లేదంటే హీరోయిన్ తో సోలోగా ఫైట్ వుంటుందా అని కామెంట్స్ పెడుతున్నారు.
ఈవెంట్ ముఖ్య అతిధులు ..
నాని హిట్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హిట్ పార్ట్ వన్ హీరో హీరో విశ్వక్సేన్.. పార్ట్ టు హీరో అడవి శేషు అలాగే, నిర్మాత ప్రశాంతి, ఫైట్ మాస్టర్ సతీష్,డైరెక్టర్ శైలేష్ కొలను తదితరులు విచ్చేశారు. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, పాటలు, టీజర్ సినిమాపై పాజిటివ్ టాక్ ని క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి రావడం మరో హైలైట్. ఆయన కోసం మహేష్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.మహేష్ బాబు SSMB 29 గురించి ఏదయినా అప్డేట్ ఇస్తారేమో అనిఅందరి కళ్ళు ఈ ఈవెంట్ పైనే వున్నాయని చెప్పచ్చు. ఆయన మాట్లాడే మాటలు సినిమాపై ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.