BigTV English

Sridevi : ఫేం మాత్రమే కాదు.. ఇలాంటి ట్రోల్స్ కూడా ఉంటాయి..!

Sridevi : ఫేం మాత్రమే కాదు.. ఇలాంటి ట్రోల్స్ కూడా ఉంటాయి..!

Sridevi ..ఈ మధ్యకాలంలో చాలామంది ఇండస్ట్రీలోకి అనుకోకుండా వచ్చి, స్టార్ సెలబ్రిటీలు అయిపోతున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో కోర్ట్ (Court) మూవీ జాబిలి అలియాస్ శ్రీదేవి (Sridevi ) కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఎక్కడో కాకినాడలో సరదా కోసం రీల్స్ చేస్తూ కెరియర్ సాగిస్తున్న ఒక అమ్మాయికి.. సడన్గా ఆడిషన్ కి రమ్మని ఫోన్ వస్తే.. అందులో భయపడుతూనే ఆడిషన్ ఇచ్చి.. ఆ తర్వాత సినిమా కూడా పూర్తి చేసి.. ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది. ఆ అమ్మాయే శ్రీదేవి. ఇప్పుడు కుర్రాళ్ళ కొత్త క్రష్ అయిపోయింది. తన అందంతో ,అమాయకత్వంతో యువత హృదయాలను దోచుకుంటున్న ఈ చిన్నది.. ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ అందుకోవడమే కాదు ఇప్పుడు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటోంది.


ఫేమ్ తో పాటూ ట్రోల్స్ కూడా..

సాధారణంగా ఎవరైనా సరే ఇంట్లో లేదా బంధువుల మధ్య సరదాగా మాట్లాడేస్తారు. కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే చాలా భయం ఉంటుంది. అసలే అనుభవం లేని ఒక అమ్మాయి.. సినిమాలో నటించడమే కాకుండా స్టేజ్ పై అందరి ముందు మాట్లాడాలంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా శ్రీదేవి కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మైక్ ఇచ్చి, అందరి ముందు మాట్లాడమంటే కాస్త భయపడిపోయింది.. అమ్మో అమ్మో అంటూ సిగ్గు బిడియం తో మైక్ పట్టుకొని మాట్లాడలేకపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈవెంట్ నిర్వహిస్తే.. అందులో కాస్త ధైర్యంగా మాట్లాడింది కానీ ఆమెలో కాన్ఫిడెంట్ మాత్రం కనిపించలేదు. దీంతో ఆమె అలా మాట్లాడిన మాటలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా ఓవర్ నైట్ లో ఫేమ్ వచ్చింది అంటే.. అంతే ట్రోల్స్ భరించాల్సి ఉంటుంది అంటూ పలువురు నెటిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ కోర్టు సినిమాలో జాబిలి పాత్రలో మంచి ట్రెయిన్డ్ యాక్టర్ గా నటించి అందర్నీ అబ్బురపరిచింది శ్రీదేవి.


ALSO READ:Betting Apps Case : వీళ్ళని కిందేసి తొక్కితే కలుగులోని ఎలుక బయటకు వస్తుంది… చీకోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్..!

కలెక్షన్లతో దూసుకుపోతున్న కోర్ట్ మూవీ..

కోర్ట్ సినిమా విషయానికి వస్తే.. రామ్ జగదీష్ దర్శకత్వంలో.. నేచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ఇది. ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో శ్రీదేవి, హర్ష రోషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం మార్చి 14వ తేదీన విడుదలై డీసెంట్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఓపెనింగ్ డే రోజున రూ.4.15 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం రోజు రూ.4.75 కోట్లు కలెక్షన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లోనే దాదాపు రూ.8.9 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా కచ్చితంగా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.30 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. కేవలం రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసింది. అటు ఓటిటి హక్కులు, మ్యూజికల్ రైట్స్ ద్వారా భారీగా బిజినెస్ జరిగినట్లు సమాచారం.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×