BigTV English

Nani – Hit 3 Collections: నాని ర్యాంపేజ్ మొదలు, హిట్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.?

Nani – Hit 3 Collections: నాని ర్యాంపేజ్ మొదలు, హిట్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.?

Nani – Hit 3 Collections: హిట్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శైలేష్ కొలను. పేరులో హిట్టు ఉన్నట్లుగానే సినిమా కూడా మంచి హిట్ అయింది. విశ్వక్సేన్ నటించిన ఈ సినిమా చాలామందికి మంచి ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. ఈ సినిమాను ప్రొడ్యూసర్ గా నాని నిర్మించాడు. ఇదే సినిమాను హిందీలో కూడా తెరకెక్కించాడు శైలేష్ కొలను. సినిమా తర్వాత అడవి చేస్తూ హిట్ 2 సినిమాను తీసి దాంతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే అదే పంథాలో సినిమాలు చేస్తే ఆడియన్స్ కి బోర్ కొడుతుంది అని తెలిసి విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే కొన్నిసార్లు ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు కొంతమంది దర్శకులు ఆ ఫెయిల్యూర్ ని ఒప్పుకోరు. కానీ శైలేష్ కొలను దానికి అతీతమని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాను అని కొన్ని సందర్భాల్లో శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు.


హిట్ 3 సినిమాతో కం బ్యాక్

హిట్ 2 క్లైమాక్స్ లో అర్జున్ సర్కార్ పాత్రను దర్శకుడు ప్రేక్షకులకు చూపించాడు. అప్పుడే హిట్ 3 సినిమాలో నాని ఉండబోతున్నాడు అనే క్లారిటీ చాలా మందికి వచ్చేసింది. ఈ సినిమాను చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు శైలేష్. ప్రొడ్యూసర్ కం హీరో కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అని చెప్పాలి. అయితే మొదటి నానితో ఈ సినిమాను తీస్తున్నప్పుడు కొంచెం బిడియం తో ఉండేవాడు శైలేష్. వెంటనే నాని నువ్వు అలా ఉండకు నీకు ఏం కావాలో అది చేయించుకో అని పిలిచి వార్నింగ్ ఇచ్చిన తర్వాత తన కావాల్సింది నాని నుంచి తీసుకోవడం మొదలు పెట్టాడు దర్శకుడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేస్తుంది.


హిట్ 3 కలెక్షన్స్

రీసెంట్ లో వచ్చిన ఏ సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత థియేటర్లో ఆడియన్స్ పెద్దగా కనిపించడం మానేశారు. మళ్లీ నాని సినిమాతో థియేటర్లు నిండాయి. ఆన్లైన్లో కూడా ఎక్కువ షోస్ థియేటర్ ఫిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మంచి శుభ పరిణామం చెప్పాలి. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 43 కోట్లు గ్రాస్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. సినిమా టాక్ కూడా బాగుంది కాబట్టి ఇంకొన్ని రోజుల్లో ఈజీగా 100 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఈ సినిమాకు ఉన్నాయి అని క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తానికి నాని మార్కెట్ కూడా బీభత్సంగా పెరిగిందని ఈ కలెక్షన్స్ తో అర్థమవుతుంది.

Also Read : Thalapathy Vijay : ఫ్యాన్స్ కి తలపతి విజయ్ సలహా, ఇలాంటి వాటికి ఇంతమంది అభిమానిస్తారు

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×