BigTV English

Hit 3 trailer : ట్రైలర్‌కి ల్యాగ్ ఒకే… కానీ, ఇది సినిమాలో లేకుండా ఉంటే చాలు…

Hit 3 trailer : ట్రైలర్‌కి ల్యాగ్ ఒకే… కానీ, ఇది సినిమాలో లేకుండా ఉంటే చాలు…

Hit 3 trailer : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు టైం సెన్స్ కి మంచి వాల్యూ ఉండేది. ఇప్పుడు మాత్రం అది పూర్తిగా నశించిపోతుంది అని చెప్పాలి. ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఎన్ని తిప్పలు పడైనా కూడా ఆ సినిమాను అదే డేట్ కి రిలీజ్ చేసేవాళ్ళు. తర్వాత కాలంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి అందువలన లేటవుతుంది, చెప్పిన టైంకి ఈ సినిమా రాకపోవచ్చు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను మళ్ళీ అనౌన్స్ చేస్తాం అంటూ కొంతమంది చిత్ర యూనిట్స్ అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. అది కాస్త ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. సినిమా రిలీజ్ డేట్ మార్చడం పక్కన పెడితే చాలా విషయాల్లో కూడా అస్సలు టైం సెన్స్ పాటించకుండా అయిపోతుందని చెప్పాలి. ట్రైలర్లు కూడా చెప్పిన టైంకి రావడం లేదు.


సైంధవ్ తర్వాత చేస్తున్న సినిమా

హిట్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శైలేస్. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని ప్రత్యేకమైన దర్శకుడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన హిట్2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అడవి శేషు నటించిన ఈ సినిమా చాలామందికి సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఈ రెండింటి తర్వాత శైలేష్ నుంచి ఒక సినిమా వస్తుందేనంటే ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే, దానితోపాటు వెంకటేష్ లాంటి స్టార్ హీరో తో మొదటిసారి సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సైంధవ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. సంక్రాంతి కానుక విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇదే విషయాన్ని శైలేస్
కూడా ఒప్పుకున్నాడు.


హిట్ 3 తో కం బ్యాక్

శైలేష్ కొలను హిట్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ 2 సినిమా చివర్లో నానిని చూపించాడు. హిట్ 3 సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోనే మంచి అంచనాలు రేపింది. ఇక టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నేడు 11 : 7 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తారు అని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ట్రైలర్ విడుదల కాలేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ కి టైం ల్యాగ్ తీసుకున్న పర్వాలేదు కానీ, సినిమాకు మాత్రం ఇలా, అలానే సినిమా కూడా ఇలా ల్యాగ్ ఉండకూడదు అని కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లేట్ అయినా కూడా నాని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనిపిస్తుంది. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో మే 1న తెలియనుంది.

Also Read : Hit 3 trailer review : అర్జున్ సర్కార్ గా నాని అరాచకం 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×