BigTV English
Advertisement

Nani : హిట్3 100కోట్ల క్లబ్ లో.. కానీ, నాని డిసప్పాయింట్మెంట్ ఎందుకు.!?

Nani : హిట్3 100కోట్ల క్లబ్ లో.. కానీ, నాని డిసప్పాయింట్మెంట్ ఎందుకు.!?

Nani : టాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ మాట్లాడుకునే సినిమా ఏదైనా ఉంది అంటే అది హీట్ 3. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో నటించిన సినిమా హిట్3. ఇటీవల మే 1న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే అత్యధిక వసూలు సాధించి 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. హిట్ 3 భారీ సక్సెస్ అయిన నాని ఎందుకో డిసంప్పాయింటెడ్ అవుతున్నారని ఫిలిం ఇండస్ట్రీలో టాక్.. ఆయన కలలన్నీ తీరుతున్న ఎందుకో ఆ ఒక్క విషయం లో నిరాశ ఎదురవుతుందిట ..అసలు ఆ కథ ఏంటో చూద్దాం..


నాని ఆ కల ఇదేనా ..

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీ నిధిశెట్టి హీరోయిన్ గా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ త్రీ మన ముందుకు వచ్చింది. మే 1న విడుదల అయి అద్భుతమైన ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకు వెళ్తుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. నాని హిట్టు పడాలి అనుకుంటే హిట్ 3 తో మంచి హిట్ నే అందుకున్నాడు. 100 కోట్ల మార్కు దాటాలి అనుకున్నాడు దాటేశాడు. కానీ నాని ఆ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు వెనకబడిపోయారు. ఒకప్పుడు నాని వరుస ప్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన నాని ఆ తర్వాత దసరాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. తర్వాత వచ్చిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం, ఇప్పుడు హిట్ 3 తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ఈ మూవీ నిలవనుంది. కానీ నాని లో ఎందుకో ఆ ఆనందం కనబడట్లేదు అని టాక్. హిట్ త్రీ పాన్ ఇండియా హిట్ అవుతుంది అనుకుంటే, తెలుగులో తప్ప మరే భాషలోనూ హిట్ అనిపించుకోలేదు. దసరా తర్వాత నాలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేశాడు. ప్రతి మూవీకి ప్రమోషన్స్ లో కూడా చాలా చురుగ్గా పాల్గొని నార్త్ సౌత్ మొత్తం తిరిగేసాడు. అయినా పెద్దగా గుర్తింపు దక్కట్లేదు. తెలుగువారికి నచ్చిన నాని సినిమాలు హిందీ, తమిళ మలయాళ అభిమానులకు నచ్చడం లేదు. ఒకటి కాకపోయినా ఏదో ఒక భాషలో అయినా నచ్చుతుంది అనుకుంటే ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది నానికి, ఏ భాషలోనూ కోటి వసూలు చేయకపోవడం విశేషం ఒక్క తెలుగులో మాత్రమే ఈ మూవీ హిట్ అయింది. తెలుగు లో హిట్ త్రీ నాలుగు రోజుల్లో 101 కోట్ల గ్రస్స్ వసూలు చేసిందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమాను 48 కోట్లకు అమ్మితే ఐదు రోజుల్లోనే పెట్టుబడి రాబట్టింది. అంతా బాగున్నా పాన్ ఇండియా స్టార్ అనిపించుకోలేకపోయారు నాని. నెక్స్ట్ మూవీ పేరడైజ్ ను పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు. ఇక అదైనా అయన కలను నిజం చేస్తుందేమో చూడాలి.


రికార్డ్స్ తెరగరాస్తున్న నాని హిట్3.

ఇక హిట్ త్రీ మూవీ ఓవర్సీస్ లో 2 మిలియన్ల డాలర్ల క్లబ్లో చేరిపోయింది. ఇది నాని కెరియర్ లోనే వరుసగా మూడవ చిత్రం గా నిలిచింది. దసరా, సరిపోదా శనివారం, సినిమాల తర్వాత ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరి ఆ సినిమాల రికార్డును తిరగరాసింది. నాని కెరియర్ లోనే నాలుగు సినిమాలే 100 కోట్ల క్లబ్లో చేరాయి వాటిలో మొదటిది 2012లో వచ్చిన ఈగ సినిమా, ఆ తర్వాత వచ్చిన దసరా చిత్రం, ఇక సరిపోదా శనివారం తాజాగా హిట్ 3 ఈ నాలుగు సినిమాలు నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మూవీగా నిలిచాయి.

Allu Arjun: అల్లు అర్జున్-అట్లీ మూవీలో మళ్లీ మార్పులు… మొత్తం తగలెట్టేలా ఉన్నారే…

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×