Nani – Ravi Teja : దసరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. ఇంతకుముందు ఎప్పుడూ నానిని చూపించిన విధంగా ఈ సినిమాలో చూపించాడు. నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది దసరా సినిమా. ముఖ్యంగా నాని క్యారెక్టర్ ను శ్రీకాంత్ డిజైన్ చేసిన విధానం విపరీతంగా చాలా మందిని ఆకట్టుకుంది. మొదటి షో పడగానే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరో అసలైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ప్రస్తుతం మళ్లీ నాని హీరోగా పారడైజ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని సమాచారం వినిపిస్తుంది. పలు సందర్భాలలో ఈ సినిమా గురించి నాని కూడా భారీ ఎలివేషన్ ఇచ్చాడు. దసరాను మించి ఈ సినిమా ఉంటుందని మంచి అంచనాలను కూడా క్రియేట్ చేశాడు.
ఇకపోతే ఈ సినిమా 1990s బ్యాక్ డ్రాప్ లో జరగనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మోకిలలో హీరో రవితేజ పొలంలో… నాని ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే శ్రీకాంత్ ఈ సినిమాతో ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేస్తాడు అని చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. ఈ సినిమా తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా సినిమాను చేయనున్నాడు శ్రీకాంత్ (Srikanth Odela). మెగాస్టార్ తో శ్రీకాంత్ చేయబోయే సినిమాను నాని ప్రజెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కేవలం మూడవ సినిమాకి మెగాస్టార్ లాంటి హీరో ఒక దర్శకుడు దొరకడం అనేది శ్రీకాంత్ అదృష్టం తో పాటు తనకున్న టాలెంట్ కూడా అని చెప్పాలి. చాలామంది మెగాస్టార్ తో సినిమా చేయాలనుకుని చేయని దర్శకులు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు.
Also Read : Game Changer Trailer: థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పూనకాలకి సిద్ధం కండి బ్రో..!
ఇక పారడైజ్ సినిమా విషయానికి వస్తే.. ఎవరు ఊహించిన విధంగా నానిని (Nani) దసరా సినిమాలో చూపించిన శ్రీకాంత్ ఈ సినిమాలో ఎలా చూపిస్తాడు అని చాలామందికి ఒక రకమైన ఆసక్తి ఉంది. ఇదేమైనా ఒక కథను అనుకున్నట్లుగా చెప్పగలిగే దర్శకులు చాలా తక్కువ మంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి తక్కువ మంది దర్శకులలో శ్రీకాంత్ కూడా ఒకడు అని చెప్పాలి. మొదటి సినిమాతోనే శ్రీకాంత్ లో ఉన్న దర్శకత్వ ప్రతిభ చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఇక పారడైజ్ సినిమాతో అదే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఒక పారడైజ్ సినిమా హిట్ అయితే చిరంజీవితో చేయబోయే సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతాయని చెప్పొచ్చు.
Also Read : Venkatesh: నేను పాడుతాను , నాకో అవకాశం ఇవ్వండి