Nara Rohit : తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, సీఏం నారా చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సొంతం తమ్ముడు నారా రామ్మూర్తి నిన్న అనారోగ్య సమస్యలతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. హీరో నారా రోహిత్ కు పితృ వియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో రామ్మూర్తి నాయుడు కన్నుమూసినట్లు తెలుస్తుంది. ఆయన మరణ వార్త విన్న రాజకీయ అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తున్నారు.. రామ్మూర్తి మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు.. తండ్రి మరణం తట్టుకోలేకపోయిన నారా రోహిత్ తన సోషిల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేసాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న నారా రోహిత్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో ఏముందంటే.. నువ్వు ఒక గొప్ప ఫైటర్ వి నాన్న.. నా మీద చూపించిన ప్రేమను నేను మర్చిపోలేను.. నాకు జీవితంలో ఎలా ఒడిదుడుగులను ఎదుర్కోవాలో నేర్పించావు. నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే.. నాకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు. మాకోసం నువ్వు ఎన్నింటినో దూరం చేసుకున్నావు. మరెన్నంటినో త్యాగం చేసావు.. నువ్వు చేసిన త్యాగలే మా జీవితాల్లో వెలుగులు నింపాయి.. నాన్న నీతో గడిపిన జ్ఞాపకాలు నాకు ముఖ్యమైనవే. జీవితాంతం వాటిని గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తాను.. నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. బై నాన్న అని పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.
నారా రామ్మూర్తి రాజకీయ జీవితం విషయానికొస్తే.. 1994 నుండి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెలేగా పనిచేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ తరచుగా వార్తల్లో నిలిచేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు..
ఇక నారా రోహిత్ సినీ లైఫ్ విషయానికొస్తే.. నారా రోహిత్ హీరోగా “సుందరకాండ” అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా, “భైరవం” అనే తమిళ రీమేక్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతున్న ఈ తరుణంలో ఇలా తండ్రిని కోల్పోవడం బాధాకరం.. ఇక ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇప్పుడు తండ్రి మరణంతో ఆ పెళ్లి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం..
Bye Nana…! pic.twitter.com/3lbYzXFwNo
— Rohith Nara (@IamRohithNara) November 17, 2024