Married Woman Fatal Love| భర్త, ఇద్దరు పిల్లలతో చక్కని సంసారం ఉన్న ఒక యువతి మరో పురుషుడితో ప్రేమలో పడింది. ఆమెను పొందడానికి ఆ ప్రియుడు తన కుటుంబాన్ని వదిలేశాడు. ఆమెను కూడా భర్త, పిల్లలను వదిలి తనతో రావాలని అన్నాడు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆ ప్రియుడు ఆమెను కిరతకంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కన్నోజ్ జిల్లా గరుసహాయ్‌గంజ్ గ్రామానికి చెందిన అజయ్ తివారీ లేబర్ పనిచేస్తాడు. అతని కుటుంబంలో అతని భార్య, ఇద్దరు పిల్లలు (పెద్దకొడుకు 11 సంవత్సరాలు, చిన్న కొడుకు 4 సంవత్సరాలు) ఉన్నారు. అయితే గ్రామంలో అతనికి పనిలేకపోవడంతో అజయ్ తివారీ ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి వలస వచ్చాడు. పెద్దకొడుకుని గ్రామంలో తన తల్లిదండ్రుల వద్ద వదిలేసి తన భార్య శోభిత, చిన్న కొడుకుతో నోయిడాలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్
ఈ క్రమంలో నవంబర్ 10న రోజు లాగే అజయ్ తివారీ ఉదయం పనికోసం బయటికి వెళ్లాడు. ఆ తరువాత సాయంత్రం అతని ఇంటి యజమాని అద్దె కోసం వచ్చినప్పుడు చూస్తే.. ఇంట్లో అజయ్ భార్య శోభిత శవం కనిపించింది, పక్కనే నాలుగేళ్ల పిల్లాడు ఏడుస్తున్నాడు. అజయ్ ఫోన్ స్విచాఫ్ ఉండడంతో అతన పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇంతలో రాత్రి 8 గంటలకు అజయ్ అక్కడికి చేరుకున్నాడు. పోలీసులు అజయ్ ని అదుపులోకి తీసుకొని శోభిత హత్య గురించి ప్రశ్నించారు. అయితే ఉదయం అజయ్ పనికోసం ఇంటి నుంచి బయలు దేరినప్పుడు తన మిత్రుడు ప్రదీప్ ఇంటికి వచ్చాడని.. తాను పనికి వెళ్లిపోయినా.. తన భార్య శోభితతో అతను మాట్లాడుతూ అక్కడే ఉన్నాడని చెప్పాడు.
దీంతో పోలీసులు అజయ్ మిత్రుడు ప్రదీప్ ను అరెస్ట్ చేశారు. ప్రదీప్ ఒక ట్యాక్సీ డ్రైవర్. అతను ఉత్తర్ ప్రదేశ్ గాజియాబాద్ కు చెందినవాడు. రెండేళ్ల క్రితం అజయ్ తన కుటుంబంతో సహా గాజియాబాద్ వచ్చాడు. పనికోసం కొన్ని నెలలు గాజియాబాద్ లోని ఒక అద్దె ఇంట్లో ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ప్రదీప్ అనే ట్యాక్సీ డ్రైవర్ తో అజయ్ కు పరిచయం ఏర్పడింది. ప్రదీప్ రెండు ట్యాక్సీలున్నాయి. ఒకటి తానే స్వయంగా నడుపుతాడు. మరొక ట్యాక్సీ అద్దెకు ఇచ్చాడు. ప్రదీప్ కు కూడా ఒక 16 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కొడుకు ఉన్నారు. అయితే ప్రదీప్, అజయ్ తో స్నేహం కారణంగా తరుచూ అజయ్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో అజయ్ భార్యకు ప్రదీప్ కానుకలు తెచ్చి ఇచ్చేవాడు. అలా అజయ్ భార్య శోభితతో ప్రదీప్ ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
Also Read: బిర్యానీ కోసం హత్య.. కాలయముడైన స్నేహితుడు..
శోభిత ప్రేమలో పడి ప్రదీప్ తన కుటుంబాన్ని వదిలేశాడు. ఆమె చుట్టూనే తిరిగే వాడు. శోభితను కూడా అజయ్, తన పిల్లలను వదిలేసి తనతో వచ్చేయాలని.. తన వద్ద అజయ్ కంటే ఎక్కువ డబ్బులున్నాయని చెప్పాడు. అందుకు శోభిత కూడా ఒప్పుకుంది. కానీ అంతలోనే అజయ్ కు నోయిడాలో పని లభించింది. అందుకే గాజియాబాద్ వదిలి నోయిడా కుటుంబంతో సహా వచ్చేశాడు. దీంతో వారిని వెతుక్కుంటూ ప్రదీప్ కూడా వచ్చేశాడు. నవంబర్ 10న అజయ్ తో కలవడానికి అతని ఇంటికి ప్రదీప్ వచ్చాడు. ఉదయం అజయ్ పనివెళ్లిపోయాడు. వెళుతూ.. ప్రదీప్ ని తాను వచ్చేంతవరకు అక్కడే ఉండాలని సాయంత్రం మంచి వంట చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాడు.
అయితే అజయ్ వెళ్లిన తరువాత శోభితను ప్రదీప్ గట్టిగా పట్టుకొని తనతో పాటు వచ్చేయాలని.. ఆమె కోసం తన కుటుంబాన్ని వదిలేశానని చెప్పాడు. కానీ శోభిత ఇప్పుడు మాటమార్చేసింది. తనకు ఇలాగే బాగుందని.. చెప్పింది. దీంతో ప్రదీప్ కు కోపం వచ్చింది. ఇద్దరూ గొడవపడ్డారు. అక్కడ పక్కనే శోభిత చిన్న కొడుకు నిద్రపోతున్నాడు. వారి గొడవ కారణంగా నిద్రలేచి చూడగా.. ప్రదీప్.. శోభిత గొంతు నులిమి చంపేయడం చూశాడు. ఆ తరువాత ప్రదీప్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు శోభిత చిన్న కొడుకు ఏడుస్తూ.. తను చూసినదంతా చెప్పాడు. ప్రదీప్ కూడా శోభిత తనను మోసం చేసినందుకే క్షణికావేశంలో హత్య చేశానని తన నేరం అంగీకరించాడు. పోలీసులు శోభిత హత్య కేసులో ప్రదీప్ ను అరెస్ట్ చేశారు.