Best Romantic Movies on OTT : 2024లో దక్షిణ భారత సినీ పరిశ్రమ మరింత స్పీడ్ గా దూసుకెళ్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో సౌత్ మేకర్స్ చేస్తున్న మ్యాజిక్ కు ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అయితే సౌత్ మేకర్స్ నుంచి వచ్చిన రొమాంటిక్ సినిమాలు కూడా ఇటీవల కాలంలో మంచి ఆదరణను సొంతం చేసుకన్నాయి. ఆకర్షణీయమైన కథాంశాలు, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే రికార్డులను బద్దలు కొట్టడం మాత్రమే కాదు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతున్నారు సౌత్ మేకర్స్. మరి అలా సౌత్ మేకర్స్ ను మైమరపించే బెస్ట్ రొమాంటిక్ సినిమాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ A అండ్ B (Sapta Sagaradaache Ello (Side A and B)
ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా సాగే ఈ ప్రేమ కథను ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ సినిమాలో డైరెక్టర్ స్ప్లిట్ నేరేటివ్ టెక్నిక్, లేయర్డ్ గా కథను చెప్పే విధానం వీక్షకులకు బాగా నచ్చేసింది. ఆలోచింపజేసే, భావోద్వేగంగా సాగే ఈ సినిమాను రొమాంటిక్ మూవీస్ అంటే చెవి కోసుకునేవారు మిస్ కాకుండా చూడవలసిన చిత్రం ఇది. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ అయ్యింది. దీనికి ఐఎండీబీలో 8/10 రేటింగ్ వచ్చింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రేమలు (Premalu)
ఈ ఉల్లాసకరమైన రొమాంటిక్ కామెడీ మూవీకి దర్శకుడు గిరీష్ ఎడి జీవం పోశారు. ఈ చిత్రం సచిన్ అనే అబ్బాయి ప్రేమలో పడడం, అమ్మాయిని దక్కించుకోవడానికి పడే పాట్లను వినోదభరితంగా చూపించారు. అయితే హీరో ఊహించని విధంగా ఈ మూవీ ట్రయాంగిల్ ప్రేమగా మారుతుంది. 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ‘ప్రేమలు’ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటి వరకు ఐదు మలయాళ చిత్రాలు మాత్రమే సాధించిన ఈ ఘనతను ‘ప్రేమలు’ తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్ (Disney + Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 7.8/10 రేటింగ్ ఉంది.
టిల్లు స్క్వేర్ (Tillu Square)
టాలీవుడ్ లో ఈ ఏడాది మొదట్లో వచ్చి సంచలనం సృష్టించిన సినిమాలలో ‘టిల్లు స్క్వేర్’ కూడా ఒకటి. ‘డీజే టిల్లు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ.. ఫస్ట్ పార్ట్ కంటే బాగానే థియేటర్లలో ఆడింది. అచ్చం ‘డీజే టిల్లు’ మూవీలో లాగే హీరో ఇందులో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తరువాత ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్ లు దిమ్మ తిరిగేలా చేస్తాయి. అయితే యూత్ బాగా ఇష్టపడే రొమాంటిక్ అంశాలకు అస్సలు కొదవ ఉండదు ఈ మూవీలో. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
డియర్ కామ్రేడ్ (Dear Comrade)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఘాటైన ప్రేమకథ ‘డియర్ కామ్రేడ్’. మీరు మంచి డెప్త్ ఉన్న ఎమోషనల్ రొమాంటిక్ సినిమాను చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney + Hotstar) , ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలలో అందుబాటులో ఉంది.