BigTV English

Mad Sequel: ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌‌.. షూటింగ్ డేట్ ఫిక్స్..!

Mad Sequel: ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌‌.. షూటింగ్ డేట్ ఫిక్స్..!

Mad Movie Sequel update


Mad Movie Sequel update(Tollywood news in telugu): గతేడాది మ్యాడ్ మూవీ థియేటర్లలో రిలీజై ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సైతం ఈ మూవీ రాబట్టింది. నిర్మాతలకు లాభాల పంట పండించింది.

ఈ మూవీకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్య దేవర, సాయి సౌజన్య నిర్మించారు. అలాగే ఈ మూవీకి ముఖ్యంగా సంగీతం అదిరిపోయిందనే చెప్పాలి. బీమ్స్ సిసిరోలియో తన సంగీతంలో సినిమాను మరో రేంజ్‌లోకి తీసుకెళ్లారు.


అంతేకాకుండా నార్నే నతిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, అనంతిక సనీల్ కుమార్, శ్రీ గౌరీ ప్రియా, రఘుబాబు, గోపికా ఉద్యన్, రచ్చరవితో పాటు మరికొంత మంది ఈ మూవీలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

READ MORE: క్రేజీ కంటెంట్ తో తెరకెక్కిన మ్యాడ్ చిత్రం ఎలా ఉందంటే..?

ఇక థియేటర్లో అదరగొట్టిన ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరు కనబరిచింది. ఓటీటీ ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి మూవీ దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ మూవీ సీక్వెల్ షూటింగ్‌ను వచ్చే నెల అంటే మార్చి నుంచే పట్టాలెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే దీనికి సంబంధించి మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ మూవీపై ఎనలేని అంచనాలు పెరిగిపోతాయనే చెప్పాలి. మరి ఈ వార్తలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×