BigTV English

Amit Rohidas suspend: ఒలింపిక్స్.. భారత హాకీ జట్టుకు ఊహించని షాక్, అమిత్‌పై ఒక మ్యాచ్ నిషేధం

Amit Rohidas suspend: ఒలింపిక్స్.. భారత హాకీ జట్టుకు ఊహించని షాక్, అమిత్‌పై ఒక మ్యాచ్ నిషేధం

Amit Rohidas suspend: భారత హాకీ జట్టుకు ఒలింపిక్ కమిటీ షాక్ ఇచ్చింది. జర్మనీతో మంగళవారం జరగనున్న మ్యాచ్‌కు డిఫెండర్ అమిత్ రోహిదాస్‌పై వేటు వేసింది. ప్రత్యర్థి ఆటగాడికి స్టిక్ తగిలించాడన్న కారణంతో ఒక మ్యాచ్ నిషేధం విధించింది. ఈ వ్యవహారంపై ఇండియా హాకీ సంఘం రియాక్ట్ అయ్యింది.


పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది భారత జట్టు. జర్మనీతో సెమీ‌ఫైనల్ మ్యాచ్‌కు రెడీ అవుతోంది. అయితే సెమీస్ మ్యాచ్‌కు టీమిండియా కీలక ఆటగాడు డిఫెండర్ అమిత్ రోహిదాస్ దూరం కాబోతున్నాడు. బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడికి అమిత్ స్టిక్ తగిలించాడన్న కారణంతో రెడ్ కార్డు అందుకోవాల్సి వచ్చింది.

చివరకు 10 మంది ఆటగాళ్లతోనే ఆడి విజయం సాధించింది భారత జట్టు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య- ఎఫ్‌ఐహెచ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు డిఫెండర్ అమిత్ రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధించింది. ఉద్దేశపూర్వకంగా ఆటగాడిని గాయపరిచే ఉద్దేశ్యం ఉంటే అప్పుడు ఆటగాడికి రెడ్‌ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. కేవలం స్టిక్ తగిలించాడన్న కారణంతో వేటు వేసింది.


ALSO READ:  అతనే ఇండియా పతనాన్ని శాసించాడు: రోహిత్ శర్మ

ఈ వ్యవహారంపై ఇండియా హాకీ సంఘం రియాక్ట్ అయ్యింది. ఇలాంటి ఘటనల వల్ల ఆటగాళ్ల ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడా సమగ్రతను కాపాడేందుకు రాబోయే మ్యాచ్‌ల్లో సరిగా జరిగేలా సమీక్షించాలని ఒలింపిక్ సంఘాన్ని కోరింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

https://twitter.com/ZtrackBuz18667/status/1820014566291497168

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×