BigTV English

Narne Nithiin – ‘Aay’ Movie Release Date: ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా ‘ఆయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Narne Nithiin – ‘Aay’ Movie Release Date: ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా ‘ఆయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Jr NTR Brother in Law Narne Nithiin Aay Movie Release Date: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు నటుడు నార్నే నితిన్. తన ఫస్ట్ మూవీ ‘మ్యాడ్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి దృష్టిలో పడ్డాడు. ఫన్‌టాస్టిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ రెస్పాన్స్‌ను అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో డీసెంట్ బాయ్‌గా కనిపించిన నటుడు నార్నే నితిన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు.


అలాగే మిగతా టీం సపోర్ట్ కూడా లభించడంతో సినిమా రేంజ్ మారిపోయింది. ఒక చిన్న సినిమాగా వచ్చి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో నిర్మాత రెండు మూడు రెట్ల లాభాలను అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ హీరో ఇప్పుడు తన కెరీర్‌లో రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ యంగ్ హీరో నార్నే నితిన్ నటిస్తోన్న కొత్త సినిమా ‘ఆయ్’.

ఈ చిత్రానికి అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు, విద్యా కొప్పినీడి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా ఫన్ అండ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో నార్నే నితిన్ లుక్ అందరినీ అట్రాక్ట్ చేసింది. అలాగే హీరోయిన్ సారిక కూడా ఎంతో అందంగా కనిపించి ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. రిలీజ్‌కు ముందే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్లు మంచి రెస్పాన్స్‌ అందుకున్నాయి.


Also Read: ఫంక్ పల్లవి.. పిల్లకు కొంచెం కుల పిచ్చి ఎక్కువ

దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నార్నే నితిన్ సరసన హీరోయిన్‌గా సారిక నటిస్తోంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా? అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న గ్రాండ్‌ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మరి మ్యాడ్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నార్నే నితిన్.. ఇప్పుడు ఆయ్ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటాడో ఆగస్టు 15న తేలిపోనుంది. కాగా ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు.

Tags

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×