Sandeep Raj: కలర్ ఫోటో సినిమాతో డైరెక్టర్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు సందీప్ రాజ్. ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది. చిన్న షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సందీప్.. కలర్ ఫోటో సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆతరువాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ మెప్పించిన ఈ కుర్ర డైరెక్టర్ ముఖ చిత్రం సినిమాకు కథను అందించాడు. ఇందులో విశ్వక్ సేన్ క్యామియోలో కనిపించాడు.
ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. అలాంటి కథను రాయడం చాలా కష్టమని విమర్శకులు సైతం ప్రశంసించారు. ప్రస్తుతం సుమ కొడుకు రోహన్ హీరోగా నటిస్తున్న మోగ్లీకి సందీప్ నే కథను అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సందీప్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన మొదటి సినిమా కలర్ ఫోటో లో ఒక కీలక పాత్రలో నటించిన చాందినీ రావుతో ఏడడుగులు వేయబోతున్నాడు.
NTR: అబ్బాయ్ టాలీవుడ్ ఎంట్రీ.. బాబాయ్ దీవెనలే హైలైట్
చాందినీ రావు సైతం షార్ట్ ఫిల్మ్స్ తోనే కెరీర్ మొదలుపెట్టింది. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆమె.. హెడ్స్ అండ్ టేల్స్, రణస్థలి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కలర్ ఫోటో సమయంలోనే వీరి మధ్య ప్రేమాయణం మొదలయ్యిందని, ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించడానికి ఇంత సమయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 11 న వీరి నిశ్చితార్థం వైజాగ్ లో ఘనంగా జరగనుంది. డిసెంబర్ 7 న సందీప్ – చాందినీ వివాహం తిరుపతిలో జరగనుందని సమాచారం. త్వరలోనే ఈ జంట అధికారికంగా తమ పెళ్లి వార్తను అభిమానులతో పంచుకొనున్నారట. ఈ విషయం తెలియడంతో అభిమానులు వారికి శుభాకాంక్షలుతెలుపుతున్నారు.