Cherlapally – Visakhapatnam Holi Special Trains: హోలీ పండుగ నేపథ్యంలో రద్దీ భారీగా పెరగడంతో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16, 17వ తేదీల్లో విశాఖపట్నం- చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది.
హోలీ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలు
విశాఖపట్నం – చర్లపల్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ – చర్లపల్లి ప్రత్యేక రైలు (08579) 16న సాయంత్రం 6.20కి విశాఖపట్నం నుంచి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానం అయిన చర్లపల్లికి చేరుకుంటుంది. చర్లపల్లి-విశాఖపట్నం ప్రత్యేక రైలు (08580) 17న ఉదయం 10 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి అదే రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు.
ఈ ప్రత్యేక రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
విశాఖపట్నం – చర్లపల్లి మధ్య నడిచే హోలీ ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఇక ఈ ప్రత్యేక రైళ్లలో టూ టైర్, త్రీ టైర్ ఏసీ, స్లీపర్ క్లాస్ తో పాటు జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లను విశాఖ- హైదరాబాద్ మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
#Holi Special Trains between Visakhapatnam – Cherlapalli – Visakhapatnam @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/RUqyQPBnCu
— South Central Railway (@SCRailwayIndia) March 14, 2025
Read Also: దేశంలో అత్యంత పురాతనమైన రైళ్లు ఇవే.. ఎన్నేండ్ల క్రితం పట్టాలెక్కాయో తెలుసా?
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
అటు ఈస్ట్ కోస్ట్ రైల్వే సైతం హోలీ సందర్భంగా అదనపు రద్దీని తగ్గించడానికి విశాఖపట్నం-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం – SMVT బెంగళూరు – విశాఖపట్నం హోలీ ప్రత్యేక రైలు రెండు ట్రిప్పులు వేయనుంది. ఈ రైలు(నంబర్ 08549) మార్చి 16తో పాటు 23న మధ్యాహ్నం 3:30 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ స్టేషన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (నంబర్ 08550) మార్చి 17, 24న మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి బయయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూరు, అరక్కోణం, కటపడి, జోలార్ పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో రెండు మార్గాల్లో హాల్టింగ్ తీసుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు మొత్తం 20 కోచ్‌లను కలిగి ఉంటుంది. వాటిలో 4 AC త్రీ టైర్, 2 AC త్రీ టైర్ ఎకానమీ, 8 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.
Read Also: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. ఎప్పుడు? ఎక్కడ అందుబాటులోకి వచ్చిందంటే?