Vikram Misri Warning: పాకిస్తాన్ బుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి ఆ పాకీ బుద్ధి మానదు. మాటలు శాంతి, చేతలు చూస్తే వంకర బుద్ధి. దేహీ అంటూ ఇంటికి వస్తే, కూర్చోబెట్టి మరీ శత్రువునైనా సత్కరించడం మనకు అలవాటు. ఈరోజు వరకు మన దెబ్బకు గజగజ వణికిన పాకీ పాక్, శాంతి చర్చలు అంటూ సందేశం పంపిన విషయం తెలిసిందే. అయితే స్వతహాగా పాక్ అంటేనే పాకీ పనుల్లో ఆరితేరింది కాబట్టి మన సైన్యం కూడా కాల్పుల విరమణ ప్రకటించినా అప్రమత్తంగా ఉంది. కేంద్రం కూడా పాక్ పై ఓ కన్ను వేసి ఉంచింది. కానీ చివరకు పాక్ మాత్రం పాకీ పని మొదలు పెట్టింది. దీనితో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి గట్టిగానే పాక్ కు ఇచ్చి పడేశారు.
అసలేం జరిగిందంటే..
భారతదేశం – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, శనివారం సాయంత్రం రెండు దేశాల DGMOల మధ్య అవగాహన కుదిరిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి (Vikram Misri) వెల్లడించారు. ఈ చర్చల వల్ల సరిహద్దుల్లో కాల్పులు ఆపేందుకు దారి తీయబోతుందనుకునే లోపే, పాకిస్తాన్ ఉల్లంఘనకు దిగిందని ఆయన చెప్పారు.
గత కొన్ని గంటలుగా, ఈ అవగాహనను పాకిస్తాన్ (Pakistan) ఉల్లంఘిస్తోందన్నారు. భారత సైన్యం (Indian Army) ఈ సరిహద్దు చొరబాటును ఎదుర్కుంటోందని, దానికి తగిన ప్రతీకారం కూడా తీసుకుంటోందని విక్రమ్ మిస్రి స్పష్టం చేశారు. ఈ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. చొరబాటుకు పూర్తి బాధ్యత పాకిస్తాన్‌దే అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్ తక్షణమే పరిస్థితిని అర్థం చేసుకొని చర్యలు తీసుకోవాలని భారత్ ఆశిస్తోందన్నారు. ఇది యుద్ధానికి ఎదురుపడుతున్న దేశానికి మాత్రమే కాదు, శాంతికి అవకాశం ఇవ్వాలనుకునే దేశాలకు కూడా పరీక్ష సమయంమని మిస్రి వ్యాఖ్యానించారు.
ఇక భారత సైన్యం అన్నింటికీ సన్నద్ధంగా ఉందని, దేశ రక్షణలో ఎలాంటి నిగ్రహం ఉండదని స్పష్టం చేశారు. DGMO స్థాయిలో వచ్చిన ఒప్పందాన్ని పాకిస్తాన్ తుంచేయడం వల్లే ఈ ఉద్రిక్తతలు మళ్లీ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. విదేశాంగ శాఖ ధీటుగా స్పందించడంతో, దేశవ్యాప్తంగా మిస్రి వ్యాఖ్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. కాగా కాశ్మీర్ వద్ద మళ్లీ కాల్పులు వినిపిస్తున్నాయని ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Pak Drone Attack: మళ్లీ భారత్‌పై పాక్ అటాక్..? ఎంతవరకు నిజం?
మిస్రీ ఇచ్చిన వార్నింగ్ తో పాక్ పాకీ పని మానుకుంటుందా? లేదా మళ్లీ మన సైన్యం చేతిలో చావు దెబ్బలు తింటుందా అన్నది తేలాల్సి ఉంది. ఏదిఏమైనా ప్రధాని మోడీ సారథ్యంలో మన దేశ సైనికులు దేనికైనా రెడీ అనే రీతిలో సిద్ధమయ్యారు. దటీజ్ భారత్ (India) .. ఇంటికి వచ్చిన శత్రువును గౌరవించే సంప్రదాయం మనది.. ఇంట్లో వారికే విషం పెట్టే వంకర బుద్ధి పాకిస్తాన్ ది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
వక్ర బుద్ధి పోనిచ్చుకోని పాకిస్థాన్..!
కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించడంపై ఆగ్రహం
స్ట్రాంగ్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టిన భారత్
పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయం
బార్డర్లో దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం#IndiaPakistanWar #IndianArmy… https://t.co/c3LHYVf0dW pic.twitter.com/WXNqj0Criw
— BIG TV Breaking News (@bigtvtelugu) May 10, 2025