Nayani Pavani..బిగ్ బాస్ (Bigg Boss) ద్వారా పాపులారిటీ సంపాదించిన వారిలో నయని పావని(Nayani Pavani) ఒకరు.. చూడ్డానికి చిన్న పిల్లలా.. చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్న ఈ నయని పావని బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది. కానీ ఓకే వారానికి హౌస్ నుండి బయటికి వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం వచ్చి దాదాపు 5 వారాలు కొనసాగింది. అయితే తాజాగా ఆహా ఓటీటీ లో ప్రసారమయ్యే ‘కాకమ్మ కథలు’ అనే షోలో పాల్గొన్న నయని పావని.. తన తండ్రి చావు, బ్రేకప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అటు తండ్రి చనిపోయిన బాధలో ఉన్న నయని పావనికి బ్రేకప్ కూడా అవ్వడంతో.. ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలి కుమిలి డిప్రెషన్ లోకి వెళ్లిందట. మరి ఇంతకీ నయని పావని ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..
ఓకే టైంలో నాన్న మరణం.. ప్రియుడు బ్రేకప్..
ఢీ, బిగ్ బాస్ తో పాటూ పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన నయని పావని.. ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు షోలలో రాణిస్తోంది. అయితే అలాంటి నయనీ పావని తాజాగా ఆహా ఓటీటీ లో ప్రసరమయ్యే కాకమ్మ కథలు (Kakamma Kathalu) షోలో మాట్లాడుతూ.. “మా అమ్మ గవర్నమెంట్ ఉద్యోగిని.. నాన్న బిజినెస్ మ్యాన్.. అలా పలు బిజినెస్ లు చేస్తూ మా కుటుంబాన్ని పోషించాడు. మా అక్క ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో బేబీ షవర్ ఫంక్షన్ చేశాం.అదే రోజు మా నాన్నకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం బయటపడింది. నాన్న స్టేజ్ 3 క్యాన్సర్ తో బాధ పడుతున్నారనే విషయం బయటపడడంతో మా ఫ్యామిలీ ఒక్కసారిగా కృంగిపోయింది. అక్క ప్రెగ్నెంట్ గా ఉండడంతో అమ్మ, అక్కను వదిలి నాన్నతో హాస్పిటల్ లో ఉండే పరిస్థితి లేదు. దాంతో నేనే నాన్నతో హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది.
also read: NTR – Neel: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో ప్రభాస్ బ్యూటీ.. నిజమేనా?
అందుకే బిగ్ బాస్ కి వెళ్ళాను..
అలా నాన్నతో పాటు హాస్పిటల్లో ఉన్న టైంలో నాకు మరో షాక్ తగిలింది.చాలా రోజులుగా రిలేషన్ లో ఉన్న నా ప్రియుడు కూడా టైం చూసి దెబ్బ కొట్టినట్టుగా బ్రేకప్ చెప్పాడు.అలాగే నాన్న కూడా చనిపోయాడు. అలా ఒకేసారి రెండు షాక్ లు తగలడంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. మా ఫ్యామిలీ మొత్తం కష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. ఆ టైంలోనే నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అయితే డబ్బుల కోసమే నేను బిగ్ బాస్ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాను. కానీ బిగ్ బాస్ కి వెళ్లిన మొదటి వారమే ఎలిమినేట్ అవ్వడంతో చాలా ఏడ్చాను.కానీ ఆ తర్వాత మళ్లీ అవకాశం వచ్చి ఐదు వారాలు బిగ్ బాస్ లో కొనసాగాను. అలా బిగ్ బాస్ ద్వారా డబ్బులతో పాటు పేరు కూడా సంపాదించాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తెలిపింది నయని పావని.ఇక బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో నయని పావని కి ఢీ(Dhee) డాన్స్ పాటు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం కూడా వచ్చింది.