Nayanthara Beyond The Fairytale: గ్లామర్ ప్రపంచంలో ఒక రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత చాలామంది ప్రేక్షకులకు.. వారు ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారు. కొందరు తమ జీవితంలో ఎదుర్కున్న కష్టాలను వారిలోనే దాచేసుకుంటే.. మరొకొందరు మాత్రం వాటిని బయటికి చెప్పి కనీసం కొందరినైనా ఇన్‌స్పైర్ చేయాలనుకుంటారు. అందుకే సినీ సెలబ్రిటీల జీవితాల ఆధారంగా డాక్యుమెంటరీలు తెరకెక్కుతుంటాయి. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి కూడా ఒక డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి లేడీ సూపర్ స్టార్ నయనతార యాడ్ అయ్యింది. త్వరలోనే తన డాక్యుమెంటరీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అప్పట్లోనే టీజర్
2022లో కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నయనతార (Nayanthara). అదే సమయంలో తన పర్సనల్ లైఫ్ గురించి ఒక డాక్యుమెంటరీ తెరకెక్కుతుందని, దానికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేశారు. అందులో విఘ్నేష్‌పై ఉన్న ప్రేమను నయన్, నయన్‌పై ఉన్న ప్రేమను విఘ్నేష్ బయటపెట్టారు. దీంతో ఈ పెళ్లి డాక్యుమెంటరీ చాలా క్యూట్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ తర్వాత మళ్లీ దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. టీజర్ విడుదలయ్యి రెండేళ్లు అయిపోవడంతో ఫ్యాన్స్ కూడా దీని గురించి దాదాపుగా మర్చిపోయారు. కానీ తాజాగా ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటెయిల్’ రిలీజ్ గురించి అప్డేట్ బయటికొచ్చింది.
Also Read: బాయ్ ఫ్రెండ్ రూమర్స్ అన్నీ నిజమే… పోస్ట్‌తో కన్ఫామ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ..!
నయన్ లైఫ్‌పై ఫోకస్
‘నయనతార బియాండ్ ది ఫెయిరీటెయిల్’ (Nayanthara Beyond The Fairytale) డాక్యుమెంటరీలో కేవలం నయన్, విఘ్నేష్ పెళ్లి గురించి మాత్రమే కాకుండా నయనతార ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు కూడా ఉండబోతున్నాయని సమాచారం. అందుకే దీని టైటిల్‌కు నయనతార పేరునే పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ కూడా తాజాగా విడుదలయ్యింది. ఇందులో నయన్ మాత్రమే కనిపిస్తోంది. రెడ్ కార్పెట్‌పై తను నిలబడి ఉండగా ఫోటోగ్రాఫర్లంతా తనను ఫోటో తీస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్‌లో కనిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటెయిల్’ విడుదలకు డేట్ కూడా ఫిక్స్ అయ్యింది.
అప్పటినుండే ప్రేమ
నవంబర్ 18 నుండి ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటెయిల్’ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఇక ఈ విషయాన్ని నయనతారతో పాటు విఘ్నేష్ శివన్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. 2015లో ఈ మూవీ విడుదల కాగా అప్పటినుండే వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అలాగే వెంటనే ప్రేమలో కూడా పడ్డారు. కానీ వీరి లవ్ స్టోరీ గురించి పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు తెలియదు. ఇక ఈ డాక్యుమెంటరీలో వీరి ప్రేమకథతో పాటు నయనతార ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/hRoYd7SYjm
— Nayanthara✨ (@NayantharaU) October 30, 2024