BigTV English
Advertisement

Abhinaya: ఎట్టకేలకు కాబోయే వాడిని పరిచయం చేసిన అభినయ.. అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Abhinaya: ఎట్టకేలకు కాబోయే వాడిని పరిచయం చేసిన అభినయ.. అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Abhinaya:’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్ బాబు(Mahesh Babu), వెంకటేష్ (Venkatesh ) చెల్లిగా నటించి, తన నటనతో అందరిని అబ్బురపరిచిన అభినయ ఆనంద్ (Abhinaya Anandh) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన ఈమె, తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచి, స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రేక్షకులను మెప్పించాలి అంటే అద్భుతమైన నటన ఉంటే చాలని, దానికి లోపంతో పనిలేదని నిరూపించింది. తెలుగులో ‘నేనింతే’, ‘దమ్ము’, ‘శంభో శివ శంభో’ వంటి సినిమాలలో నటించి, ప్రేక్షకులకు దగ్గరైన ఈమె తెలుగు తోపాటు తమిళ్, కన్నడ సినిమాలలో నటిస్తూ.. మంచి ఆదరణ సొంతం చేసుకుంది.


కాబోయే భర్త పరిచయం చేసిన అభినయ..

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈమె ప్రేమ గురించి వార్తలు పెద్ద ఎత్తున వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఆ వార్తలపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత తాను 15 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటానని తెలిపింది. ఒక వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరుపుకున్నట్టు ఉంగరాలు మార్చుకొని, గుడిగంటలు కొడుతున్న ఫోటోని షేర్ చేస్తూ నిశ్చితార్థం అయ్యిందని, తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అభినయ. దీంతో ఈమెకు కాబోయే భర్త ఎవరు? ఎలా ఉంటారు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు మాత్రం తెలియజేయలేదు. దీంతో అభినయ కాబోయే భర్త ఎవరు? ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు? అని అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు తనకాబోయే భర్తను పరిచయం చేసి, అతడి గురించిన పలు వివరాలను వెల్లడించింది అభినయ.


అభినయ భర్త తెలుగు వారే..

అభినయ కాబోయే భర్త పేరు కార్తీక్. ఇటీవల కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఆమె షేర్ చేసింది. ఇక మొత్తానికి అయితే కార్తీక్ హైదరాబాద్ అబ్బాయి కావడం విశేషం. ఈయన బిజినెస్ మ్యాన్. పలు రకాల బిజినెస్ లు చేస్తూ కెరీర్ లో కొనసాగిస్తున్నట్లు సమాచారం. కార్తీక్ కి అభినయ గత 15 సంవత్సరల క్రితమే పరిచయమైందని, అతనితో ప్రేమలో ఉంటూ త్వరలోనే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.అభినయ కాబోయే భర్త ఒక తెలుగువాడు అని తెలిసి తెలుగు అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వివాహం తర్వాత హైదరాబాద్ లోనే సెటిల్ అవుతారా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Bollywood: పవిత్రమైన దేవాలయంలో నీచమైన పని… ఓర్రీపై కేసు ఫైల్..!

అభినయ కెరియర్..

అభినయ మోడల్ గా కెరియర్ ఆరంభించి, నటిగా పేరు సొంతం చేసుకుంది. 2009లో వచ్చిన ‘నాదో దిగల్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె సినిమాలే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. 2023లో వచ్చిన ‘మాన్షన్ 24’ అనే వెబ్ సిరీస్ లో నటించగా.. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తెలుగులో చివరిగా గా ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘విద్యా వాసుల అహం’ వంటి చిత్రాలలో నటించిన ఈమె.. మలయాళం లో ‘పని’ అనే సినిమాలో కూడా నటించింది.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×