Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) తన అందంతోనే కాదు నటనతో, హుందాతనంతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె .. తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో పదుల సంఖ్యలో సినిమాలు చేసి రికార్డు సృష్టించింది. స్టార్ హీరోలు అందరి సరసన నటించి భారీ పేరు సొంతం చేసుకున్న నయనతార అటు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తన నటనతో బాలీవుడ్ ఆడియన్స్ ను తన అభిమానులుగా మార్చుకుంది. ఇకపోతే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ స్పెషల్ క్రేజ్ అందుకున్న ఈమె పెళ్లి తర్వాత తన హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vighnesh shivan) ను ప్రేమించి పెళ్లి చేసుకుని.. సరోగసి ద్వారా ఇద్దరూ మగ కవల పిల్లలకి కూడా జన్మనిచ్చారు. ఇకపోతే పెళ్లి తర్వాత ఈమెకు అవకాశాలు భారీగా తగ్గిపోయాయి. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమె ప్రస్తుతం ‘మూకుత్తి అమ్మన్ – 2’ సినిమాతోపాటు చిరంజీవి (Chiranjeevi ) ‘మెగా 157’ సినిమాలో నటిస్తోంది.
రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను – నయనతార
ఇదిలా ఉండగా తాజాగా నయనతార కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే రూ.100 కోట్లు ఇచ్చినా సరే ఆ హీరో పక్కన హీరోయిన్ గా చేయను అని నయనతార అన్నట్టు ఆ వార్తల సారాంశం. ఆ హీరో ఎవరు అనే విషయానికొస్తే ఆయన మరెవరో కాదు శరవణన్ (Saravanan). తెలుగు, తమిళ్ ,కన్నడ సినీ ప్రేక్షకులకు ఈయన బాగా సుపరిచితమే. ఈయన హీరోగా 2022లో ‘ది లెజెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా నయనతారను తీసుకుందామని అనుకున్నారట.అయితే ఆయన పక్కన ఆమె హీరోయిన్గా నటించడానికి అంగీకరించలేదట. ముఖ్యంగా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా సరే ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో ఆ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటెలా (Urvashi Rautela)ను హీరోయిన్గా తీసుకున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నయనతారపై మాత్రం ఇప్పుడు వచ్చిన ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ALSO READ; Nagarjuna : కుటుంబంతో సహా సీఎం రేవంత్‌ను కలిసిన నాగార్జున.. మ్యాటర్ ఏంటంటే..?
రూమర్స్ పై నయనతార స్పందిస్తారా?
ఇకపోతే ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నా.. అటు నయనతార కానీ ఇటు శరవణన్ కానీ ఎవరు స్పందించలేదు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ది లెజెండ్ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి సినిమాలో నయనతార నటించకపోవడమే బెటర్ అని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా తనపై వస్తున్న రూమర్స్ ని నయనతార స్పందించి కొట్టిపారేస్తుందేమో చూడాలి. ఇక నయనతార విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిరు 157 లో అవకాశం అందుకుంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.