AA 22×A6 Movie :అల్లు అర్జున్ (Allu Arjun).. సుకుమార్(Sukumar ) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులర్ కి సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి.దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా లెవెల్ లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో #AA22 అనే వర్కింగ్ టైటిల్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా అవతార్ వంటి చిత్రాలకు పని చేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీని రంగంలోకి దింపారు. ఈ వి ఎఫ్ ఎక్స్ కోసమే ఏకంగా రూ.270 కోట్లు కేటాయిస్తుండగా.. హీరో అల్లు అర్జున్ కోసం మాత్రమే రూ.150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
అట్లీ – అల్లు అర్జున్ కాంబోలో ఐదో హీరోయిన్ గా నాని బ్యూటీ..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక విషయంపై రోజుకొక వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇందులో మొత్తం ఐదు మంది హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే మొత్తం నలుగురు ఫైనల్ కాగా, ఇప్పుడు నాని (Nani ) హీరోయిన్ ని కూడా రంగంలోకి దింపబోతున్నారు మేకర్స్. ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తో పాటు మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur),దీపికా పదుకొనే(Deepika Padukone), భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నాని హీరోయిన్ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) కూడా వచ్చి చేరింది. ఇకపోతే ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి సిస్టర్ పాత్ర ఉంటుందని, ఆ పాత్ర ఈ సినిమా కథను మలుపు తిప్పుతుందని సమాచారం. ఇక అందులో భాగంగానే ఆ ప్రత్యేకమైన పాత్రకు నజ్రియాను తీసుకోబోతున్నట్లు సమాచారం.
కథను మలుపు తిప్పే పాత్రలో నజ్రియా..
ఇన్ని రోజులు మలయాళం, తెలుగులో హీరోయిన్గా వరుస సినిమాలలో నటించిన నజ్రియా.. ఇప్పుడు అల్లు అర్జున్ కి సిస్టర్ పాత్రలో నటించనుంది అని తెలుస్తోంది. గతంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘రాజా రాణి’ చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే చెల్లి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికి’ సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే మరి బన్నీకి చెల్లిగా నటించబోతున్న ఈ ముద్దుగుమ్మ తన పాత్రతో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ కోసం అట్లీ ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశారట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఒక డాన్ చుట్టూ ఈ కథ సాగుతుందని, ఇందులో అల్లు అర్జున్ పాత్ర చాలా పవర్ఫుల్గా యాక్షన్ అండ్ ఎమోషనల్ గా ఉంటుందని ఇప్పటివరకు అల్లు అర్జున్ ని చూడని ఒక సరికొత్త పాత్రలో చూడబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.